కోరుకున్నది ప్రాప్తిస్తుంది...

అమ్మవారి చల్లనిచూపుతో సకల శుభాలూ కలుగుతాయి. శరన్నవరాత్రులు దేవికి మరింత ప్రీతికరమైనవి. ఆ తొమ్మిదిరోజులు పూజించడం కుదరనివారు అష్టమినాడు అర్చించాలంటూ ఒక కథ చెబుతారు. పూర్వం

Updated : 07 Oct 2021 05:33 IST

అక్టోబర్‌ 12 దేవీ త్రిరాత్రి వ్రతం

అమ్మవారి చల్లనిచూపుతో సకల శుభాలూ కలుగుతాయి. శరన్నవరాత్రులు దేవికి మరింత ప్రీతికరమైనవి. ఆ తొమ్మిదిరోజులు పూజించడం కుదరనివారు అష్టమినాడు అర్చించాలంటూ ఒక కథ చెబుతారు. పూర్వం శరదృతువులో దక్షుడు యజ్ఞం ప్రారంభించాడు. అష్టమినాడు భద్రకాళి జనించింది. ‘పుర్కాష్టమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞవినాశినీ పారదుర్భూతా మహాఘోరా యోగినీ కోటిభిః సహా’ అన్నారు. యోగినీ గణాలు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చి దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసినందున ఆరోజు ఆమెను ప్రసన్నం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇంకొంచెం శ్రద్ధతో సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో దేవీ త్రిరాత్రి వ్రతం ఆచరిస్తే కోరుకున్నది ప్రాప్తిస్తుందని చెప్పే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. భర్త సత్యవంతుడు అల్పాయుష్కుడని తెలిసి సర్వమంగళ అయిన పార్వతీదేవిని పూజించేది సావిత్రి. భర్త ఆయుష్షు పెంచమని ప్రార్థించేది. అయినా సత్యవంతుడి ఆయువు తీరిపోయే సమయం దగ్గర పడిందని తెలిసి ఆవేదన చెందుతుండగా ఓరోజు నారదుడు వచ్చి సావిత్రిని దేవీ త్రిరాత్రి వ్రతంతో భర్తకు దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని చెప్పాడు. ఆ వ్రత ప్రభావంతోనే సత్యవంతుణ్ని దక్కించుకోగలిగిందనేది పురాణ కథనం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని