దారిద్య్రం అంటే ఏమిటి?

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) ‘ముఫ్లిస్‌ (దరిద్రులు) అంటే ఎవరు?’ అనడిగితే ‘డబ్బు లేనివాళ్లు’ అన్నారు శిష్యులు.

Updated : 04 Nov 2021 06:28 IST

కసారి ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) ‘ముఫ్లిస్‌ (దరిద్రులు) అంటే ఎవరు?’ అనడిగితే ‘డబ్బు లేనివాళ్లు’ అన్నారు శిష్యులు.

‘డబ్బు లేకపోవడం దారిద్య్రం కాదు, మీరిది వినండి! ఎప్పుడో ఒకరోజు ప్రళయం వస్తుంది. భూమ్యాకాశాలు నశిస్తాయి. ఆరోజు లోకమంతా మైదానంగా మారుతుంది. అప్పుడో వ్యక్తి వెలకట్టలేని పుణ్యాలతో అల్లాహ్‌ ముందు హాజరై, తనకంటే పుణ్యాత్ముడు లేడని మురిసి పోతుంటాడు. చేసిన మంచికి గానూ స్వర్గాన్ని అనుభవించాలనుకుంటాడు. అల్లాహ్‌ న్యాయ స్థానంలో డబ్బు చెల్లదు. బాధితులకు పుణ్యకార్యాల కరెన్సీని పరిహారంగా ఇవ్వాలి. దౌర్జన్యం చేసినందుకు, హక్కులను కొల్లగొట్టినందుకు వాళ్లకి తాను సంపాదించుకున్న పుణ్యాన్ని ఇవ్వాలి. చేసుకున్న పుణ్యాలన్నీ అయిపోయినా బాధితులింకా మిగిలే ఉంటారు. వారి పాపాలు అన్నీ అతనిపై మోపగా అవి పర్వతంలా పెరుగుతాయి. దైవ దూతలు అతన్ని ఈడ్చుకుంటూ తీసికెళ్లి నరకాగ్నిలో పడేస్తారు.  అప్పుడు అతని కంటే దరిద్రుడు ఇంకెవరుంటారు?’ అన్నారాయన..
దైవారాధన, దానధర్మాల్లాంటి మంచి పనులు చేసినంతలో అల్లాహ్‌ అనుగ్రహం దక్కదు. రక్తసంబంధీకులు, ఇరుగుపొరుగుల హక్కులు నెరవేర్చాలి. దుర్భాషలు, దౌర్జన్యాలు, అప్పు ఎగ్గొట్టడం- వీటన్నింటి గురించి అల్లాహ్‌ ప్రశ్నిస్తాడని ఖురాన్‌ హెచ్చరిస్తోంది. కనుక డబ్బు లేకున్నా మంచి నడవడి అలవర్చుకుని, నలుగురికి సాయం చేస్తే అల్లాహ్‌ అనుగ్రహం లభిస్తుంది. మనతో వచ్చేది డబ్బు కాదు చేసిన పాపపుణ్యాలే.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని