సముద్ర స్నానం ఎందుకు, ఎలా?

అశ్వత్థసాగరౌసేవ్యౌ సస్పర్శస్తు కదాచనఅశ్వత్థం మందవారేచ సముద్రం పర్వణి స్పృశేత్‌సకాల నియమస్సితా సముద్ర స్నాన కర్మణిఅశ్వత్థ వృక్షం, సముద్రాలను ఎప్పుడంటే అప్పుడు సేవించకూడదు, స్పృశించకూడదు. అశ్వత్థాన్ని శనివారం నాడు,

Updated : 11 Nov 2021 22:53 IST

అశ్వత్థసాగరౌసేవ్యౌ సస్పర్శస్తు కదాచన
అశ్వత్థం మందవారేచ సముద్రం పర్వణి స్పృశేత్‌
సకాల నియమస్సితా సముద్ర స్నాన కర్మణి

అశ్వత్థ వృక్షం, సముద్రాలను ఎప్పుడంటే అప్పుడు సేవించకూడదు, స్పృశించకూడదు. అశ్వత్థాన్ని శనివారం నాడు, సముద్రాన్ని పర్వదినాల్లో స్పృశించాలి. ఆనకట్ట లేదా వంతెనకు ఎలాంటి నిషేధాలూ లేవు. ఆషాఢ, కార్తిక, మాఘ, వైశాఖ పూర్ణిమ రోజుల్లో సముద్రస్నానం చేయాలి. ఆ రోజులు గనుక శుక్ర, మంగళ వారాల్లో వస్తే చేయకూడదు. కొంచెం మట్టిని చేతిలోకి తీసుకుని, సముద్రానికి సంకల్పం చెప్పుకుని, మట్టిని ఆ నీటిలో వదిలి స్నానం చేయాలి. తర్వాత మామూలు నీటితో మళ్లీ స్నానం చేయాలి. సాగరజలంలో ఉన్న ఉప్పు శరీరంలో ఉన్న మలినాలను బయటకు లాగుతుంది కనుక ఇది ఆరోగ్యానికి మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని