వెన్నముద్దలు.. బెల్లం

పూర్వం ఓ రైతు భార్య వెన్నముద్దలు తయారుచేసేది. రైతు పట్నం వెళ్లి ఒక దుకాణదారుడికి అమ్మి, వచ్చిన డబ్బుతో అతని దగ్గరే నిత్యావసర వస్తువులు కొనుక్కొచ్చేవాడు. ఎప్పట్లాగే వెన్న అమ్మిన డబ్బుతో సరుకులు కొని ఇంటిముఖం పట్టాడు.

Updated : 25 Nov 2021 06:29 IST

పూర్వం ఓ రైతు భార్య వెన్నముద్దలు తయారుచేసేది. రైతు పట్నం వెళ్లి ఒక దుకాణదారుడికి అమ్మి, వచ్చిన డబ్బుతో అతని దగ్గరే నిత్యావసర వస్తువులు కొనుక్కొచ్చేవాడు. ఎప్పట్లాగే వెన్న అమ్మిన డబ్బుతో సరుకులు కొని ఇంటిముఖం పట్టాడు. దుకాణదారుడికి వెన్నముద్దల బరువు సరిగా లేదనిపించి తూకమేయగా ప్రతిదీ వంద గ్రాములు తక్కువుంది. ఇన్నాళ్లుగా తనను ఇంత మోసం చేస్తున్నాడా అని యజమానికి చిర్రెత్తుకొచ్చింది. మరుసటి వారం వచ్చిన రైతుని ‘నీలాంటి మోసగాడి దగ్గర వెన్న తీసుకోవడం నాదీ బుద్ధి తక్కువ’ అంటూ దూషించాడు. ఆ మాటలకు రైతు అయోమయంగా చూసి, ‘అయ్యా! మా ఇంట్లో తూకం రాళ్లు లేవు. అందువల్ల మీ దగ్గర తీసుకెళ్లే కిలో బెల్లానికి సరితూగేలా వెన్నముద్దలను తూసి తెస్తున్నాను’ అన్నాడు.

దాంతో వ్యాపారికి మాట పెగల్లేదు. మోసకారుల ప్రవర్తన గురించి ఉలమాలు చెప్పిన కథ ఇది.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు