జ్ఞానోదయం

కోశాంబి నగర వీధుల్లో బుద్ధుడు భిక్షటనకు బయల్దేరాడు. దారి పక్కన ఓ క్షురకుడు ఒక యువకుడికి గడ్డం గీస్తున్నాడు. ఇంతలో ఉధృడనే శిష్యుడు కల్పించుకుని ‘గురుదేవా! మీరు దేవుడున్నాడని చెబుతుంటారు! కానీ ఆ మాటల మీద నాకు నమ్మకం

Updated : 16 Dec 2021 03:49 IST

కోశాంబి నగర వీధుల్లో బుద్ధుడు భిక్షటనకు బయల్దేరాడు. దారి పక్కన ఓ క్షురకుడు ఒక యువకుడికి గడ్డం గీస్తున్నాడు. ఇంతలో ఉధృడనే శిష్యుడు కల్పించుకుని ‘గురుదేవా! మీరు దేవుడున్నాడని చెబుతుంటారు! కానీ ఆ మాటల మీద నాకు నమ్మకం కలగడంలేదు. ఎందుకంటే.. అదిగో, దూరంగా వెళ్తోన్న ఆ బధిరుడు గొప్ప భక్తుడు. మరి నిజంగా దేవుడుంటే.. పెరిగిన అతడి జుట్టును, గడ్డాన్ని బాగుచేయొచ్చు కదా!’ అన్నాడు. దానికి బుద్ధుడు ‘దేవుడు రోజూ లక్షల వేల కోట్ల జీవుల ప్రార్ద్థనలు వింటున్నాడంటే నమ్మగలవా? అయితే అందరికీ ఓకేసారి ఫలితం ఇస్తే తాను సృష్టించిన కాలం చేసే విధులను తనే అడ్డుకున్నట్టు అవుతుంది. కనుక ఆయా వ్యక్తుల ప్రార్థనలకు ఇవ్వాల్సిన ఫలితాన్ని నిర్దేశిత సమయంలో ఇస్తున్నాడు. ఇక బధిరుడి ప్రార్థన మరి కొద్దిసేపటిలో ఫలించబోతోంది. అదెలాగో నువ్వే చూడు’ అన్నాడు. పక్కనున్న క్షురకుడు ‘ఎలా స్వామీ?’ అన్నాడు ఆశ్చర్యంగా. అపుడాయన నవ్వుతూ ‘దేవుడు అన్నిచోట్ల, అందరిలో ఉన్నాడు. ఎదుటివారికి సాయం చేసేవాళ్లంతా దైవస్వరూపులే’ అన్నాడు. అంతే! క్షురకుడు వేగంగా వినికిడిశక్తి లేని వ్యక్తిని తీసుకొచ్చి బుద్ధునితో, ‘స్వామీ! సాయం చేయడంలో అంత గొప్పతనం ఉందా?! ఇతనికి ఉచితంగా క్షవరం చేస్తాను’ అన్నాడు. ఇదంతా చూసిన శిష్యుడు ‘దేవుడున్నాడు స్వామీ!’ అంటూ బుద్ధునికి నమస్కరించాడు.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని