సుఖసంతోషాల అన్వేషణ...

నిత్య జీవితంలో సుఖాలను అందుకోవాలనే ఆరాటంతో పరుగులు పెడుతుంటాం. తీరా ఆనందించే అవకాశం వస్తే మూర్ఖత్వంతో చేజార్చు కుంటాం. ఎండమావుల్లాంటి సంతోషాలను అన్వేషిస్తూ మళ్లీ ప్రయాణం సాగుతుంది. నిజానికి ఆనందం అనేది..

Updated : 30 Dec 2021 06:36 IST

నిత్య జీవితంలో సుఖాలను అందుకోవాలనే ఆరాటంతో పరుగులు పెడుతుంటాం. తీరా ఆనందించే అవకాశం వస్తే మూర్ఖత్వంతో చేజార్చు కుంటాం. ఎండమావుల్లాంటి సంతోషాలను అన్వేషిస్తూ మళ్లీ ప్రయాణం సాగుతుంది. నిజానికి ఆనందం అనేది.. అనుభవం, అనుభూతి, ఎంపికల్లో ఉంటుందని చెప్పేవారు స్వామీ వివేకానంద. అందుకు నిదర్శనంగా ఒక ఉదాహరణ చెప్పారో సందర్భంలో...
చైనాలో ఓ వ్యక్తికి సుదీర్ఘ జైలుశిక్ష పడింది. కొన్నాళ్లకు జైలు అధికారి మారాడు. అతడు ఔదార్యం చూపడంతో కొందరు ఖైదీలకు శిక్షాకాలం తగ్గింది. అలా ఆ వ్యక్తిని జైలు నుంచి విడుదల చేశారు. కానీ బయటి కొచ్చిన అతడు ‘నాకిక్కడేం బాగా లేదు. నేను బొత్తిగా వెలుగును చూడలేక పోతున్నాను. ఎలుకలు తిరిగే చీకటి కారాగారమే అనువుగా ఉంది. దయచేసి నన్ను తిరిగి జైలుకి పంపండి.. అలా కుదరదంటే చంపేయండి’ అంటూ వేడుకున్నాడు. ఆశ్చర్యపోయిన జైలు అధికారులు అతణ్ణి తిరిగి జైలుకి పంపారు.

- మండూరి ఆకాంక్ష


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని