హనుమ జన్మ సందేశం

త్రిపురాసుర సంహారంలో విష్ణువు సహకారం అందుకున్న పరమశివుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణ సంహారంలో విష్ణు అవతారమైన శ్రీరాముడికి సహకరంచాడని పరాశర సంహిత చెబుతోంది.

Updated : 06 Jan 2022 06:32 IST

త్రిపురాసుర సంహారంలో విష్ణువు సహకారం అందుకున్న పరమశివుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణ సంహారంలో విష్ణు అవతారమైన శ్రీరాముడికి సహకరంచాడని పరాశర సంహిత చెబుతోంది. ఒకరి నుంచి ఉపకారం పొందిన వారెవరైనా కృతజ్ఞతతో మెలగాలన్నదే హనుమ జన్మలోని సందేశం. వాల్మీకి రామాయణం ప్రకారం పుంజికస్థల అనే అప్సరస బృహస్పతి శాపం వల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరునికి అంజనాదేవి పేరుతో కుమార్తెగా జన్మించింది. వానర రాజు కేసరి భార్య అయింది. హనుమంతుని జన్మ రామేశ్వరులను అనుసంధానించింది కనుక రామేశ్వరం వద్ద రామసేతు నిర్మాణానికి కూడా హేతువైంది. హనుమ అసలు పేరు సుందరుడు కనుకే వాల్మీకి సీతాన్వేషణ కాండకు సుందర కాండమని పేరు పెట్టారు.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని