కళాఖండాలకు నిలయం.. మ్యూజియం  

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం అత్యంత రమణీయమైన ప్రకృతి శోభతో మూడంతస్తుల భవనంలో అలరారుతోంది. యాత్రికులకు చారిత్రక పరిజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే ప్రధాన కేంద్రం.

Published : 07 Nov 2021 15:16 IST

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం అత్యంత రమణీయమైన ప్రకృతి శోభతో మూడంతస్తుల భవనంలో అలరారుతోంది. యాత్రికులకు చారిత్రక పరిజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే ప్రధాన కేంద్రం. మ్యూజియంలో ప్రాచీన హిందూ సంస్కృతి, వైష్ణవ సంప్రదాయాలకు చెందిన ఆరు వేలకు పైగా కళాఖండాలు ప్రదర్శించారు. 

 తాళ్లపాక అన్నమాచార్యులు తాళపత్రాలపై రాసిన సంకీర్తలను, ఆయన పెద్దకుమారుడు పెద్ద తిరుమలాచార్యులు, మనుమడు చిన్న తిరుమలాచార్యులు, విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు కాలంలో రాగిరేకులపై చెక్కించారు. ఈ అసలైన రాగి రేకులు మ్యూజియంలో భద్రపరిచారు.
 విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమలను సందర్శించి పచ్చ, వజ్ర, వైఢూర్య, రత్నాలతో కూడిన ఆభరణాలను స్వయంగా బహూకరించారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకునికి శ్రీకృష్ణదేవరాయలు బహూకరించిన ధూపగంటను సైతం మ్యూజియంలో తిలకించవచ్చు. 
 అరుదైన ఆలయ చారిత్రకాంశాలను తెలియజేసే వర్ణచిత్రాలు, శ్రీవారి ఆభరణాలు, సమకాలీన కళాకారులు చిత్రీకరించిన శ్రీనివాసుడు, తిరుమల క్షేత్రం వివరణాత్మక చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. బాపు చిత్ర ఖండాలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
 ప్రాచీన కాలంలో నాటి పాలకులు వాడిన కత్తులు, కఠార్లు, కవచాలు, అంకుశం ఆయుధ సామగ్రి ఉంది. 
 శ్రీవారి హుండీ నుంచి సేకరించిన బంగారు, వెండి, రాగి నాణేలు,  ఆనంద నిలయం రాతిగోడపై చెక్కిన శాసనాలు కాగితం అద్దకం ద్వారా సేకరించి ప్రదర్శించారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని