కోనేటిరాయుడికి కొండంత బంగారం 

బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాదుల ఆభరణాల అలంకరణలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు భక్తకోటికి దర్శనమిస్తున్నారు. అనాదిగా రాజులు, రాణులెందరో స్వామికి మొక్కులు చెల్లించారు.

Published : 16 Oct 2021 07:50 IST

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాదుల ఆభరణాల అలంకరణలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు భక్తకోటికి దర్శనమిస్తున్నారు. అనాదిగా రాజులు, రాణులెందరో స్వామికి మొక్కులు చెల్లించారు. పల్లవరాణి స్వామివారికి వెండి విగ్రహాన్ని బహూకరించారు. ఆయనే పవళింపు సేవలందుకునే భోగ శ్రీనివాసమూర్తి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమలకు విచ్చేసి వెండి పళ్లాలు, ఆభరణాలు, మణిమయ కిరీటాలు, మకరతోరణాలు బహూకరించడమే కాకుండా ఆనంద నిలయ గోపురానికి బంగారు తొడుగు చేయించారు. భగవంతుడికి తమకు కలిగినంతలో తృణమో పణమో   సమర్పిస్తామని భక్తులు మొక్కుకోవడం ఆనవాయితీ. దాతల విభాగంలో వివిధ ట్రస్టులకు విరాళాలు సమర్పిస్తున్నారు. స్వామివారికి స్వర్ణాభరణాలు, ఇతరత్రా ఆస్తులను దాతలు అందజేస్తున్నారు. శ్రీనివాసుడి ఊరేగింపునకు రథాలు, వాహనాలు బంగారంతో చేసినవి ఉన్నాయి. శ్రీవారికి ఉన్న అరుదైన ఆభరణాల్లో గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు. స్వామివారికి ఏడు కిరీటాలున్నాయి. తితిదే చేయించినవాటితో పాటు గద్వాల్‌ మహారాణి కిరీటం ముఖ్యమైనది. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలున్నాయి. శ్రీవారి మూలవిరాట్టు కిరీటం నుంచి పాదపద్మాల వరకు వివిధ రకాల ఆభరణాలు మూడు సెట్లు ఉన్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని