Smart Roofs: కాలానుగుణంగా పైకప్పులు
ఇంటి బయట పోర్టికో.. మేడపైన పెంట్‌హౌస్.. బాల్కనీలో పైకప్పులు.. కారు కోసం షెడ్ అవసరమైనప్పుడు తెరుచుకునేలా... వద్దనుకునేటప్పుడు మూసుకునేలా ఏర్పాట్లు ఉంటే.. అందునా ఒక మీట నొక్కితే ఆటోమేటిక్‌గా ఇదంతా జరిగేలా ఉంటే ఎంత సౌకర్యమో కదా! చలికాలంలో ఎండకోసం ఓపెన్‌గా ఉండేలా చూసుకోవచ్చు.. వర్షం పడేటప్పుడు పైకప్పును మూసేయవచ్చు.
స్మార్ట్‌రూఫ్స్‌తో నచ్చినట్లుగా డిజైన్
మీట నొక్కితే తెరుచుకునేలా ఏర్పాట్లు
ఈనాడు, హైదరాబాద్
ఇంటి బయట పోర్టికో.. మేడపైన పెంట్‌హౌస్.. బాల్కనీలో పైకప్పులు.. కారు కోసం షెడ్ అవసరమైనప్పుడు తెరుచుకునేలా... వద్దనుకునేటప్పుడు మూసుకునేలా ఏర్పాట్లు ఉంటే.. అందునా ఒక మీట నొక్కితే ఆటోమేటిక్‌గా ఇదంతా జరిగేలా ఉంటే ఎంత సౌకర్యమో కదా! చలికాలంలో ఎండకోసం ఓపెన్‌గా ఉండేలా చూసుకోవచ్చు.. వర్షం పడేటప్పుడు పైకప్పును మూసేయవచ్చు. ఇలాంటి స్మార్ట్‌రూఫ్స్ ఇప్పుడు ఇంటి నిర్మాణంలో భాగం అవుతున్నాయి. కొత్తరకం నిర్మాణ సామగ్రి ఇంటికి అందంతో పాటు అవసరాలను తీర్చడంలో బహుళ ఉపయోగకరంగా ఉంటున్నాయి.
ఇంటి నిర్మాణంలో సంప్రదాయ విధానంలో ఎక్కువగా కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తుంటాయి. వీటిని శాశ్వత కట్టడాలుగా నిర్మిస్తుంటారు. ఇటీవల ఇంటి డిజైన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా అవుట్‌డోర్‌లో అల్యూమినియం వాడకం పెరిగింది. అవసరమైన చోట స్టెయిన్‌లెస్ స్టీల్, గ్లాస్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇంటి వెలుపల ప్రదేశాలను గరిష్ఠంగా ఉపయోగించుకోవడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే సహజంగా వచ్చే వెలుతురుకు అడ్డుపడుతుంది. గాలి ప్రసరణ తగ్గిపోతుంది. ఎండాకాలంలో ఉక్కపోతగా మారుతుంది. అదే చలికాలం వస్తే ఎండ రాదనే ఇబ్బంది ఉంటుంది. కాలాలకు అనుగుణంగా పైకప్పులను నిర్మించుకోలేమా? అంటే ఇప్పుడు ఏదైనా సాధ్యమే అంటున్నాయి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఉత్పత్తులు.
కావాల్సినట్లుగా...
ఆధునిక ఇళ్లలో అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్, గ్లాస్ ఉపయోగిస్తున్నా.. వీటిని సైతం శాశ్వత ప్రాతిపదికనే ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి నిర్మిస్తే మన అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజూ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. కేవలం అందంగా కనిపించేందుకో, తక్కువ స్థలంలో నిర్మించవచ్చనో వీటిని వాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన స్మార్ట్ పైకప్పులను ప్రతిరోజూ మనకు కావాల్సినట్లుగా మార్చుకోవచ్చు. కాలానికి అనుగుణంగా ఇండోర్, అవుట్‌డోర్‌ను సెట్ చేసుకోవచ్చు.
ఇలా పనిచేస్తుంది
అల్యూమినియం మిశ్రమంతో రూపొందించిన పైకప్పుల లూవర్‌లు మీట నొక్కగానే ఒక పరదా మాదిరి తెరుచుకుంటాయి. వద్దనుకుంటే మూసుకుంటాయి. కావాల్సిన ఆకృతిలో ఉండే ఫ్రేమ్‌పైన వీటిని అమర్చుతారు. 12 ఓల్ట్ డీసీ మోటారుతో పైకప్పుల లూవర్‌లు పనిచేస్తాయి. 180 డిగ్రీల వరకు తిరుగుతాయి. రిమోట్‌తోనూ నిర్వహించుకోవచ్చు. నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే వానకు తుప్పు పట్టడం, కారడం వంటి సమస్యలు ఉండవు.
* ఉదాహరణకు ఇంటి పోర్టికోలో ఏర్పాటు చేసుకుంటే ఉదయం పూట ఎండ కోసం తెరుచుకోవచ్చు. మధ్యాహ్నం పూట ఎండపడకుండా మూసేసుకోవచ్చు.
* ఈతకొలను దగ్గర ఏర్పాటు చేసే డెక్, ఓపెన్ ఎయిర్ థియేటర్, టెర్రస్ గార్డెన్ పైన స్మార్ట్ పైకప్పులను ఏర్పాటు చేసుకోవచ్చు.
* ఇంటి రంగులు, నిర్మాణ శైలికి తగ్గట్టుగా అల్యూమినియం పైకప్పులను పౌడర్ కోట్ చేయవచ్చు.
ప్రయోజనమిలా..
చలికాలంలో సూర్యుని సహజ వెలుతురు ఇంట్లో పడేలా చేస్తుంది. ఒక మీట నొక్కగానే లూవర్‌లు తెర్చుకుని భవనానికి కావాల్సిన వెలుతురు అందేలా చేస్తుంది. వేసవిలో వేడిని నిరోధిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు