Developers: 50 శాతం డెవలపర్లు ఏం కోరుతున్నారంటే

దేశవ్యాప్తంగా 50 శాతం డెవలపర్లు పన్నుల హేతుబద్ధీకరణ, వడ్డీరేట్ల తగ్గింపును కోరుకుంటున్నారు. వేర్వేరు నగరాల్లోని బిల్డర్లతో ఏప్రిల్, మే నెలల్లో క్రెడాయ్, కొలియర్స్‌ సంస్థ సర్వే నిర్వహించింది.

Published : 06 Jul 2024 02:02 IST

క్రెడాయ్, కొలియర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన సెంటిమెంట్‌ సర్వే 2024లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 50 శాతం డెవలపర్లు పన్నుల హేతుబద్ధీకరణ, వడ్డీరేట్ల తగ్గింపును కోరుకుంటున్నారు. వేర్వేరు నగరాల్లోని బిల్డర్లతో ఏప్రిల్, మే నెలల్లో క్రెడాయ్, కొలియర్స్‌ సంస్థ సర్వే నిర్వహించింది. రెండుమూడేళ్లుగా గృహ నిర్మాణ మార్కెట్‌ డిమాండ్‌ పెరిగిందని... ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ మున్ముందు ఇదే దూకుడు కొనసాగుతుందని బిల్డర్లు ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించింది. 2024లోనూ ఇళ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారని నివేదిక పేర్కొంది.

బడ్జెట్‌ నుంచి ఆశిస్తున్నవి

  • పన్నుల హేతుబద్ధీకరణ
  • సరసమైనఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు
  • అనుమతులకు ఏకగవాక్ష విధానం 
  • జీఎస్‌టీ ఇన్‌ఫుట్‌ ట్యాక్స్‌లో రాయితీ
  • వడ్డీరేట్ల తగ్గింపు

18 నగరాల్లోని 550 మంది డెవలపర్ల నుంచి సమాచారం సేకరించారు. అందులో ముఖ్యాంశాలు (శాతాల్లో)

80 ప్రవాస భారతీయుల నుంచి ఇళ్లకు డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్న డెవలపర్లు
53 2022తో పోలిస్తే 2023లో కొనుగోలుదారుల నుంచి ప్రాజెక్ట్‌ల విచారణలు పెరిగాయన్న డెవలపర్లు 
52 ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఉంటుందన్న నిర్మాణదారులు 
50 2024లోనూ గృహాలకు స్థిరంగా డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు 
45 గత ఏడాదిలో 10 నుంచి 20 శాతం నిర్మాణ ధరలు పెరిగాయని వెల్లడించిన వారు
27 ఈ ఏడాది డిమాండ్‌ పాతికశాతం పెరుగుతందని అంచనా వేస్తున్న బిల్డర్లు
గత ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఇళ్ల సగటు ధరలు 

కొత్త తరహా ప్రాజెక్ట్‌లపై దృష్టి 

66% కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తున్నవారు. (ప్లాటెడ్‌ డెవలప్‌మెంట్స్, బ్రాండెడ్‌ రెసిడెన్సీస్, సీనియర్‌ లివింగ్‌ వంటివి). 
30%  సులభతర వ్యాపార విధానాల్లో మెరుగుదల ఉంటుందని భావిస్తున్న బిల్డర్లు. (ప్రభుత్వపరంగా అనుకూల విధానాలు, నియంత్రణ విధానాలను మెరుగుపర్చడం, అనుమతుల విధానాల్లో సంస్కరణలు).


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని