సొంతింటి కల సాకారమిలా..

సొంతిల్లు కొనాలనే ఆలోచన ఉన్నా వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌లను సందర్శించడం కుదరడం లేదా? హైదరాబాద్‌లో ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి? వాటిలో ధరలెలా ఉన్నాయి? ప్రీమియం ప్రాజెక్ట్‌లలో కొత్తగా వస్తున్న పోకడలేమిటి? పెట్టుబడి దృష్ట్యా స్థలాలు ఎక్కడ కొనొచ్చు? వీటన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ‘ఈనాడు’ మెగా ప్రాపర్టీ షోని సందర్శించాల్సిందే. కొండాపూర్‌ హైటెక్స్‌ రోడ్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌లో మెగా ప్రాపర్టీ షో .....

Updated : 04 Jan 2020 02:13 IST

నేడు, రేపు ‘ఈనాడు’ మెగా ప్రాపర్టీ షో
ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌ల ప్రదర్శన
ఈనాడు, హైదరాబాద్‌

సొంతిల్లు కొనాలనే ఆలోచన ఉన్నా వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌లను సందర్శించడం కుదరడం లేదా? హైదరాబాద్‌లో ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి? వాటిలో ధరలెలా ఉన్నాయి? ప్రీమియం ప్రాజెక్ట్‌లలో కొత్తగా వస్తున్న పోకడలేమిటి? పెట్టుబడి దృష్ట్యా స్థలాలు ఎక్కడ కొనొచ్చు? వీటన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ‘ఈనాడు’ మెగా ప్రాపర్టీ షోని సందర్శించాల్సిందే. కొండాపూర్‌ హైటెక్స్‌ రోడ్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌లో మెగా ప్రాపర్టీ షో శనివారం ఉదయం ప్రారంభం అవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోలో నగరంలోని ప్రముఖ సంస్థలన్నీ పాల్గొంటున్నాయి. ఆయా సంస్థలు చేపట్టిన నిర్మాణ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, లే అవుట్‌ వెంచర్ల వరకు ఆయా ప్రాజెక్ట్‌లను తమ స్టాల్స్‌లో ప్రదర్శించనున్నారు. బడ్జెట్‌లో దొరికే ఫ్లాట్‌లు మొదలు ప్రీమియం విల్లాల వరకు ఇక్కడ ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో చేపట్టిన అపార్ట్‌మెంట్‌లు, విల్లాలే కాదు తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్‌లో చేపట్టిన ప్రాజెక్ట్‌ల గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.


పాల్గొంటున్న సంస్థలివే..

నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి. అపర్ణా, సాయిసూర్య, మైహోమ్‌, ఈఐపీఎల్‌, ఎస్‌ఎంఆర్‌, జనప్రియ, జెమ్‌ వివిండాస్‌, వర్చూస, ప్రగతి, భూశక్తి, వర్టెక్స్‌, దేవాన్స్‌, ఎస్‌ అండ్‌ ఎస్‌ గ్రీన్‌ ప్రాజెక్ట్స్‌, మ్యాక్‌ ప్రాజెక్ట్స్‌, సైబర్‌సిటీ, శ్రీఆదిత్య, ప్రణీత్‌, ఎన్‌సీసీ అర్బన్‌, సీబీసీ ప్రాజెక్ట్స్‌, సిల్వర్‌ సాండ్స్‌, ఫార్చూన్‌ 99, శ్రీక, సాకేత్‌, శాంతాశ్రీరాం, గ్రీన్‌హోమ్‌, ప్రెస్జేజ్‌ డెవలపర్స్‌, ఎన్‌సీఎల్‌ హోమ్స్‌, సద్గురు హోమ్స్‌, హర్షిత్‌, అస్యూర్డ్‌ ప్రాపర్టీ, ఫ్యూచర్‌ ఎకార్స్‌, జేబీ ఇన్‌ఫ్రా, ప్రిక్సిల్‌ క్రియేటివ్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చూన్‌ ఇన్‌ఫ్రా, ఏటీఎస్‌, బట్టర్‌ఫ్లైసిటీ, సువర్ణభూమి, కపిల్‌ ప్రాపర్టీస్‌, శాండ్‌స్టోన్‌, ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఈజీవే సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి.

ఎక్కడ: సైబర్‌ కన్వెన్షన్‌, హైటెక్స్‌ రోడ్‌, కొండాపూర్‌
ఎప్పుడు: శని, ఆదివారం
ఉదయం.. 10 నుంచి రాత్రి 7 గంటల వరకు
ప్రవేశం: ఉచితం
వివరాలకు: 8008552667, 9121293447 నంబర్లలో సంప్రదించవచ్చు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని