శ్రీమంతులు పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారంటే...!

దేశంలోని అత్యంత ధనవంతులు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? ఆర్థిక మందగమనంలోనూ వారి ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి? నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ 2020 ప్రకారం ఇరవై శాతం పెట్టుబడులు స్థిరాస్తుల్లోనే అంటున్నారు మన శ్రీమంతులు. ప్రపంచ సగటు 27 శాతం ఉండగా.. ఆసియా ధనవంతుల్లో 28 శాతంగా ఉంది.

Published : 07 Mar 2020 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలోని అత్యంత ధనవంతులు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? ఆర్థిక మందగమనంలోనూ వారి ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి? నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ 2020 ప్రకారం ఇరవై శాతం పెట్టుబడులు స్థిరాస్తుల్లోనే అంటున్నారు మన శ్రీమంతులు. ప్రపంచ సగటు 27 శాతం ఉండగా.. ఆసియా ధనవంతుల్లో 28 శాతంగా ఉంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చితి కనిపిస్తున్నటికీ ఆస్తుల కొనుగోలులో ఆసక్తి మాత్రం తగ్గలేదని అధ్యయనకర్తలు అంటున్నారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా కొందరు ప్రైవేటు ఇన్వెస్టర్లు వారి నిర్ణయాలను వాయిదా వేస్తున్నప్పటికీ మెరుగైన రాబడి ఇచ్చే స్థిరాస్తుల్లో పెట్టుబడులు తగ్గవని అంచనా వేస్తున్నారు.

* శ్రీమంతులకు స్థిరాస్తి ఇప్పటికీ ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనమే. ఇళ్లపైన మోజు ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాదిలో తమ అంతస్తుకు తగ్గ కొత్త ఇల్లు కొనడానికి 24 శాతం మంది అత్యంత ధనవంతులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
* మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ వీరు స్థిరాస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మన దేశం వెలుపల మొదటి ప్రాధాన్యమంటే యూకే అంటున్నారు. ఆ తర్వాత యూఎస్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనూ పెట్టుబడులు పెడుతున్నారు.
* ఇంటి కొనుగోలు చేసే ప్రాంతం, అక్కడి సౌకర్యాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముందడుగు వేస్తున్నామని 64 శాతం మంది శ్రీమంతులు అన్నారు.

వాణిజ్య ఆస్తుల్లో..
* అత్యంత ధనవంతులు వాణిజ్యపరమైన స్థిరాస్తుల్లో 26 శాతం పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నారు. వీరిలో 15 శాతం మంది విదేశాల్లో నిధులు వెచ్చించే యోచనలో ఉన్నారు. యూకె. యూఎస్‌, యూఏఈ, సింగపూర్‌, ఆస్ట్రేలియా వీరి ప్రాధాన్య దేశాలుగా ఉన్నాయి.

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని