గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలోనే ఉండాలా?

ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. నాలుగు తలుపులు అంతకంటే కాదు. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా, ఆహ్లాదకర వాతావరణంలో నివాసముండాలి. ఆరోగ్యసూత్రాలు మిళితమై ఉన్న శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరగాలి. వాస్తు ప్రకారం గుమ్మాలు, కిటికీలు సరిసంఖ్యలోనే ఉండాలా? బేసి సంఖ్యలో ఉండకూడదా? ఈ అంకెలు

Published : 02 Jan 2021 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. నాలుగు తలుపులు అంతకంటే కాదు. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా, ఆహ్లాదకర వాతావరణంలో నివాసముండాలి. ఆరోగ్యసూత్రాలు మిళితమై ఉన్న శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరగాలి. వాస్తు ప్రకారం గుమ్మాలు, కిటికీలు సరిసంఖ్యలోనే ఉండాలా? బేసి సంఖ్యలో ఉండకూడదా? ఈ అంకెలు, సంఖ్యలో కొత్తగా ఇల్లు కట్టుకునేవారు తికమకపడుతుంటారు. ఇలాంటి సందేహాలకు ప్రముఖ వాస్తునిపుణులు పి.కృష్ణాదిశేషు ఇస్తున్న వాస్తు సూచనలిలా..
ఇంటిలో గాలి, వెలుతురుతోపాటు రాకపోకలకు అనువుగా ఉండే గుమ్మాలు, కిటికీలు సరిసంఖ్యలోనే ఉండాలి. అంకె చివర సున్నా రాకూడదు. అంటే 10.. 20.. 30.. ఇలా అన్నమాట. అదేవిధంగా 1, 3, 5, 7, 9, 11, 13.. మాదిరిగా బేసి సంఖ్యలో కూడా ఉండకూడదు అనేది బహుళ ప్రాచుర్యంలో ఉంది.   ఒక్కోసారి లెక్క తప్పు కాకూడదని అవసరమున్నా లేకున్నా కావలసిన దానికన్నా గుమ్మాలు, కిటికీలు ఎక్కువో, తక్కువో పెడుతుంటారు. వాస్తవానికి ఆరోగ్యంగా జీవించడానికి ఏదైనా కావవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నట్లయితే వృథా కింద లెక్క. నిజానికి మనిషి జీవితంలో వివాహం ఆత్యంత ప్రాధాన్యమైందని మనకందరికీ తెలిసిందే. పెళ్లి తంతులో మూడు ముళ్లు, ఏడడుగులు, ఒకే ఒక అరుంధతీ నక్షత్రం చూపిస్తుంటారు. ఇవి బేసి సంఖ్యలోనే ఉంటాయి. మనిషి శరీరంలో నవరంధ్రాలు బేసి సంఖ్యే. 2 కళ్లు, 2 చెవులు, 2 కిడ్నీలు, 2 కాళ్లు, 2 చేతులు.. ఇలా శరీరభాగాలు సరి సంఖ్యలతో ముడిపడి ఉందన్నది కాదనలేము. అలాంటప్పుడు మనిషి కట్టించే ఇంటికి ఈ నిబంధన ఎందుకు అనే సందేహం రావచ్చు.  గుమ్మాలు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలని చెప్పడానికి వాస్తుశాస్త్రంతోపాటు శాస్త్రీయంగా చూస్తే ఆ ఇళ్లలో ఉంటున్నవారు గాలి, సూర్యరశ్మి పొందడంలో సమతుల్యత లోపించకుండా ఉండడానికి ఈ నియమాలు నిబంధనలు దోహదపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని