రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. అందుబాటు ఇళ్లపై ప్రభావం
ఈనాడు, హైదరాబాద్
సామాన్య, మధ్యతరగతి వారి సొంతింటి కల మరింత భారంగా మారింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో అందుబాటు ధరలోని ఇళ్లను సైతం అందుకోలేని పరిస్థితి. హైదరాబాద్‌లో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉన్న ఇళ్లను అఫర్డబుల్ హౌసింగ్‌గా నిర్మాణదారులు చెబుతున్నారు. రూ.50 లక్షల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేస్తే.. ఇదివరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.3 లక్షలు అయ్యేవి. ఇప్పుడు ఏకంగా మరో రూ.75వేలు పెరిగింది. గతంలో ఉన్న ఛార్జీలను చెల్లించేందుకే కొనుగోలుదారులు ఆపసోపాలు పడేవారని..డబ్బులు సర్దుబాటు కాక రిజిస్ట్రేషన్లు సైతం వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయని చిన్న బిల్డర్లు అంటున్నారు. వీరే ఎక్కువగా అందుబాటు ధరలో ఇళ్లు కడుతున్నారు. అఫర్డబుల్ హౌసింగ్ వరకైనా స్టాంపు డ్యూటీని 2.5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన ఛార్జీలతో ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. వీటిపై జీఎస్టీ ఒక శాతం మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి స్థలాల చదరపు గజం, బహుళ అంతస్తుల నివాసాల్లో చదరపు అడుగుల ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరలు ఒకరకంగా ఉంటే వాస్తవంగా అమ్మే ధరలు అంతకు ఒకటి రెండు రెట్లు ఎక్కువే ఉంటాయి. ఈ రెండింటి మధ్య అంతరం భారీగా ఉండటం.. 2013 తర్వాత భూముల మార్కెట్ విలువ పెంచకపోవడంతో వీటి ధరలను సవరించారు. 20 నుంచి 50 శాతం వరకు మార్కెట్లో భూముల విలువ పెంచారు. ఈ ధరలపైన ప్రస్తుతం 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలి. ఇవి రెండూ పెరగడంతో అందుబాటు ఇళ్ల కొనుగోలుదారుడిపైన భారం సగటున రూ.లక్షపైనే ఉంటుందని నిర్మాణదారులు చెబుతున్నారు. భూముల మార్కెట్ విలువ పెంచడాన్ని స్వాగతించిన స్థిరాస్తి సంఘాలు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని ఆక్షేపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరి స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. తగ్గించకపోయినా.. కొవిడ్ ప్రభావం తగ్గేవరకు పెంచవద్దని విజ్ఞప్తి చేశాయి. కానీ ప్రభుత్వం ఛార్జీలు పెంచడం. ఇప్పటికే అమల్లో రావడం చకచకా జరిగిపోయాయి.
ఇదీ పరిస్థితి..
రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతం ఉన్నప్పుడే అల్పాదాయ వర్గాలు అంత మొత్తం భరించలేక నెలల తరబడి రిజిస్ట్రేషన్ వాయిదా వేసేవారని నిర్మాణదారులు చెబుతున్నారు. పొదుపు చేసిన మొత్తం, దాచుకున్న సొమ్ములు, అప్పు చేసిన డబ్బులు మొత్తం కలిపి ఇంటికి కట్టేవారు. తీరా రిజిస్ట్రేషన్‌కు సొమ్ములు లేక.. ఎక్కడా సర్దుబాటు కాక... చేతిలో డబ్బులు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని సమయం కోరేవారని బిల్డర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో 1.5 శాతం అధికంగా స్టాంప్‌డ్యూటీ పెరగడం ఇలాంటివారికి మరింత భారం అంటున్నారు.
తగ్గించినా తేడా రాదు..
కొందరు ఇంటి విక్రయ విలువ ప్రకారం పూర్తి ధరకు రిజిస్ట్రేషన్ చేయిస్తుండగా.. మరికొందరు ప్రభుత్వ మార్కెట్ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రూ.50 లక్షలకు ఇల్లు కొని విక్రయ ధరకే రిజిస్ట్రేషన్ చేయిస్తే ప్రస్తుతం రూ.3.75 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ చేయిస్తే.. ఆ ప్రాంతంలోని ఇంటి ధర రూ.25 లక్షలు ఉంటే.. ఆ ప్రకారం రూ.1.88 లక్షల వరకు అవుతుంది. అయితే ఎక్కువ మంది గృహ రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేస్తుండటంతో ప్రభుత్వ మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మధ్యే మార్గంగా ఇంటికి రూ.40 లక్షల ధరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఇలాంటివారు రూ.3 లక్షల వరకు కట్టాల్సి వస్తోంది. స్టాంప్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గిస్తే ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కలిపి 4.5 శాతం అవుతుంది. అప్పుడు ఛార్జీలు రూ.1.80 లక్షలకు తగ్గుతాయని.. కొనుగోలుదారులకు భారం కాకుండా ఉంటుందని చిన్న బిల్డర్లు సూచిస్తున్నారు. ఛార్జీలు తగ్గించినా.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గదని చెబుతున్నారు. తక్కువ స్టాంప్ డ్యూటీ ఛార్జీలతో కొనుగోలు చేసిన ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎక్కువ మంది ముందుకొచ్చే అవకాశం ఉందని.. ఫలితంగా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని సూచిస్తున్నారు.
* తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన అందుబాటు ధరల ఇళ్లకు మాత్రం జీఎస్టీని ఒక శాతంగా, రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ ఛార్జీలు 7.5 శాతం వసూలు చేస్తున్నారు. జీఎస్టీ ఒక శాతం ఉన్న ఇళ్లవరకైనా స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నారు.
* నిర్మాణంలో ఉన్న వాటికి మాత్రమే జీఎస్టీ వసూలు చేస్తున్నారు. జీఎస్టీ+ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండూ చెల్లించాల్సి రావడం నిర్మాణంలో ఉన్న ఇళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాకపోతే నిర్మాణ సమయంలో ఇంటి ధరలు తక్కువగా ఉంటాయి.
* పూర్తయి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ పొందిన ఇళ్లకు జీఎస్టీ వర్తించదు. కాకపోతే నిర్మాణం పూర్తయ్యే సమయానికి రెండు మూడేళ్లు పడుతుంది. అప్పటికి ధరలు పెరుగుతాయి. ఏ రకంగా చూసినా కొనుగోలుదారుడికి భారమే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!