సిద్ధమవుతున్న సూట్ హోమ్స్
హైదరాబాద్ రియాల్టీ సరికొత్త మార్పులకు వేదికవుతోంది. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న భాగ్యనగరం అందుకు తగ్గట్టుగా నయా పోకడలను అందిపుచ్చుకుంటోంది. కొత్త విభాగాల్లోకి రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తరిస్తోంది. గృహ, వాణిజ్య, కార్యాలయ,
నగరంలో మారుతున్న అద్దె ఇళ్ల పోకడ
రియల్ ఎస్టేట్ కొత్త అసెట్క్లాస్గా ‘కో లివింగ్’
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రియాల్టీ సరికొత్త మార్పులకు వేదికవుతోంది. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న భాగ్యనగరం అందుకు తగ్గట్టుగా నయా పోకడలను అందిపుచ్చుకుంటోంది. కొత్త విభాగాల్లోకి రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తరిస్తోంది. గృహ, వాణిజ్య, కార్యాలయ, రిటైల్, వేర్‌హౌసింగ్‌తో పాటూ ప్రస్తుతం కో లివింగ్ వచ్చి చేరింది. కొత్త అసెట్క్లాస్గా పలు సంస్థలు వీటిలో పెట్టుబడులు పెడుతున్నాయి. విదేశాల్లో తరహాలో అద్దె నివాసాల తీరుతెన్నులను మార్చబోతున్నాయి.
కలిసి పనిచేయడం గురించి విన్నాం. నగరంలో చాలా అంకుర సంస్థలు కో వర్కింగ్ స్పేస్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంటాయి. కార్యాలయం ఒకటే కానీ వేర్వేరు సంస్థలు అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తుంటాయి. రిసెన్షన్, కాఫీ లాంజ్ వంటివి ఉమ్మడిగా ఉపయోగించుకుంటారు. ఇదే మాదిరి ఇప్పుడు కో లివింగ్ అంటున్నారు. సిటీలో పలు సంస్థలు ఇప్పటికే వీటిని నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి పనిచేసే ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో వీటికి మరింత ఆదరణ ఉంటుందని చెబుతున్నారు.
కో లివింగ్ అంటే..
అద్దె ఇళ్లలో పడక గది, బాల్కనీ, స్నానాల గది మాత్రమే ఉంటాయి. కిచెన్ ఉన్నా డ్రై కిచెన్ వరకే పరిమితం. సలాడ్స్ వంటివి మాత్రమే చేసుకునే వీలుంటుంది. సుమారు 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇళ్లు ఉంటాయి. వీటినే సూట్ హోమ్స్ అంటున్నారు. స్టూడియో రూమ్ అని కూడా పిలుస్తున్నారు. వంటగది, గ్రంథాలయం, జిమ్, యోగా కేంద్రం, లాంజ్, వర్క్జోన్, యుటిలిటీ ప్రాంతం అన్ని ఉమ్మడిగా ఉంటాయి. మిగతావారితో కలిసి వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. రోజులో 9 గంటలు పడకగదికే పరిమితం అవుతుంటారు. మరో 8 గంటలు కార్యాలయంలో గడిపితే.. ఇంట్లోని మిగతా చోట్ల ఉండేది చాలాకొద్ది సమయం మాత్రమే. ఈ మాత్రం దానికి మొత్తం అద్దె ఎందుకు చెల్లించడం? ఎక్కువ ఉపయోగిస్తున్న స్థలం వరకే ఇల్లు అద్దెకు తీసుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచనతోనే కో లివింగ్ తెరమీదకు వచ్చింది. చూస్తుంటే హోటల్ తరహలో ఉంది అంటారా? అక్కడ నెలల తరబడి ఉంటే అద్దెలు భరించడం కష్టం. అందుకే ఇల్లులాగా ఉంటుంది కాబట్టి కో లివింగ్ అంటున్నారు.
ఇతర ప్రాంతాలకు విస్తరణ
ఈ తరహా నివాసాలు ఇప్పటివరకు ఎక్కువగా ఐటీ కారిడార్‌లో ఉన్నాయి. ఐదారు సంస్థలు ఈ రంగంలో కొనసాగుతున్నాయి. ఇదివరకే నిర్మించిన భవనాలను లీజుకు లీసుకుని వాటికి మార్పులుచేర్పులు చేసి అద్దెకిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోకడ నగరంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ప్రత్యేక అసెట్క్లాస్గా కొత్త నిర్మాణాల కోసం పెట్టుబడులు పెడుతున్నారు. పశ్చిమ హైదరాబాద్ నుంచి క్రమంగా దక్షిణ హైదరాబాద్ వైపు కో లివింగ్ పోకడలు విస్తరిస్తున్నాయి. స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలు కొత్త అసెట్ క్లాస్‌పై దృష్టి సారిస్తున్నాయి. ‘‘భూముల ధరలు పెరగడంతో భవిష్యత్తులో సొంతిల్లు అనేది మరింత భారం కానుంది. మున్ముందు కో లివింగ్కే ఆదరణ ఉంటుంది. అమెరికా, ఐరోప్ దేశాల్లో ఎక్కువగా ఈ సంస్కృతి కన్పిస్తుంటుంది. మన దేశంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న దిల్లీ రాజధాని ప్రాంతం, ముంబయి, బెంగళూరులో ఈ పోకడను చూడొచ్చు. ఇప్పుడు కో లివింగ్ అనేది కొత్త అసెట్క్లాస్. ఎదుగుతున్న నగరంగా హైదరాబాద్‌లో వృద్ధికి అవకాశం ఉండటంతో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం. వేర్వేరు నగరాల నుంచి భాగ్యనగరానికి వచ్చేవారు ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు ఉండేందుకు సౌకర్యంగా ఉంటాయి. ఇప్పటివరకు నగరానికి దక్షిణం వైపు నాణ్యమైన అద్దె ఇళ్లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏరోసిటీలో కోలివింగ్ ప్రాజెక్టు చేపట్టాం’ అని బోస్టన్ లివింగ్ డైరెక్టర్ ఆదిత్య సూర్నెని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!