విశాలమైన ఇల్లు..తగ్గేదేలే!
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో ఇప్పటికీ విశాలమైన ఇళ్లకే అధిక డిమాండ్ ఉంది. అత్యధిక మంది 1000-2000 చదరపు అడుగుల లోపల విస్తీర్ణం కలిగిన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగినా సౌకర్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. గత నెలలో చూస్తే మొత్తం రిజిస్టర్ అయిన ఫ్లాట్లలో వెయ్యి నుంచి రెండువేల లోపు చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లవాటానే 74 శాతంగా ఉంది. గత ఏడాది కంటే ఇది 4 శాతం అధికం.
రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల ధరలు పెరగడంతో ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు నిర్మాణ ముడిసరకు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో నిర్మాణదారులూ పెంచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో చదరపు అడుగు సగటున రూ.4368 ఉంటే.. హైదరాబాద్‌లో రూ.4048, మేడ్చల్ జిల్లా పరిధిలో రూ.2872, సంగారెడ్డి జిల్లాలో రూ.2484గా ఉంది. నాలుగు జిల్లాల సగటు ధర రూ.3698 ఉంది. వార్షిక పెరుగుదల 21 శాతంగా ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సగటు చదరపు అడుగు రూ.5వేలు పలుకుతోంది. ఈ ప్రభావం విక్రయాలపై పడింది. ధరల పెరుగుదలతో కొనుగోలు వాయిదా వేస్తున్నారు తప్ప... విస్తీర్ణం పరంగా మాత్రం రాజీ పడటం లేదు.
ఉమ్మడి అవసరాలకే అధికం..
కొత్తగా కడుతున్న బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు. విశాలమైన కారిడార్, క్లబ్‌హౌస్, ఫాట్ల మధ్య ఎడం వంటివి పాటిస్తున్నారు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇల్లు కొంటే 30 శాతం ఉమ్మడి అవసరాలకే పోతుంది. దీంతో కార్పెట్ ఏరియా తగ్గుతోంది. చూడటానికి ఇల్లు మరీ చిన్నగా కనబడుతోంది. స్టాండలోన్ అపార్ట్మెంట్లలో 800 చ.అ. విస్తీర్ణం వరకు వస్తుండగా.. గేటెడ్ కమ్యూనిటీల్లో 700 చ.అ. మాత్రమే ఉంటుంది. దీంతో ఎక్కువగా 2.5, 3 పడక గదులకు మొగ్గు చూపుతున్నారు. సహజంగా ఇవి వెయ్యి చదరపు అడుగులపైనే ఉంటాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Archana: ‘మగధీర’లో అవకాశాన్ని అలా చేజార్చుకున్నా: అర్చన
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్
-
World News
Zimbabwe: త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!
-
Politics News
Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
World News
Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య