Updated : 11 Jun 2022 07:15 IST

ఎంత విస్తీర్ణంలో.. ఎన్ని అంతస్తులు

60 గజాల్లోపు అయితే సున్నా సెట్‌బ్యాక్‌

విస్తీర్ణం పెరిగే కొద్దీ అదనపు అంతస్తులకు అవకాశం

1196 చ.గజాలు దాటితే బహుళ అంతస్తులే

ఎంత స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవచ్చు? సెట్‌బ్యాక్‌ ఎంత వదలాల్సి ఉంటుంది.? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న చాలా మందిలో ఇలాంటి సందేహాలెన్నో ఉంటాయి. భూ విస్తీర్ణం ఆధారంగా భవనాలను ఎంత ఎత్తున నిర్మించుకోవచ్చో తెలుపుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ 7, 2012లో జీవో.ఎం.ఎస్‌.నం.168 విడుదల చేసింది. దాని ప్రకారం 60 గజాల్లోపు స్థలానికి ఎలాంటి సెట్‌బ్యాక్‌లు అక్కర్లేదు. రోడ్డువైపు కొంత స్థలాన్ని వదిలి ఎంచక్కా ఇల్లు కట్టుకోవచ్చు. విస్తీర్ణం 1196 చ.గజాలు దాటితే బహుళ అంతస్తులు నిర్మించుకోవచ్చు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అనుమతించిన అంతస్తులపై టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌)ను ఉపయోగించుకుని అదనంగా ఒకటి లేదా రెండు అంతస్తులు కట్టుకోవచ్చు. ఎత్తుకు తగ్గట్లు వేర్వేరు శాఖల నుంచి అనుమతులు, నిరభ్యంతర పత్రాలు అవసరమవుతాయి. టీఎస్‌బీపాస్‌ చట్టం రావడంతో ఆయా అనుమతులు, నిరభ్యంతరాలు పొందడం నిర్మాణదారులకు సులువైంది. ఏకగవాక్ష విధానంలో తేలిగ్గా అనుమతులు లభిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఎస్‌బీపాస్‌ చట్టం వచ్చినప్పటి నుంచి నిర్మాణ అనుమతులు దాదాపు గడువులోపే మంజూరవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పటైనప్పటికీ విస్తీర్ణంపరంగా నిర్మాణాల ఎత్తును పరిమితం చేసే ఆనాటి నిబంధనలు కొనసాగుతున్నాయి.

విస్తీర్ణం 60 గజాలలోపు

జీ+1కు అనుమతి లభిస్తుంది. పార్కింగ్‌కు స్థలం వదలాల్సిన అవసరం లేదు. ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పు 40అడుగుల నుంచి 60అడుగుల మేర ఉంటే 5 అడుగులు, 60 అడుగుల నుంచి ఎంత వెడల్పు ఉన్నా 10 అడుగుల మేర సెట్‌బ్యాక్‌ వదలాలి. మిగిలిన మూడు వైపులా సెట్‌బ్యాక్‌ వదలనక్కర్లేదు.

60-120

* జీ+1 అనుమతికి పార్కింగ్‌ అక్కర్లేదు. ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పు 40 నుంచి 60అడుగుల మేర ఉంటే 5 అడుగులు, 60 అడుగుల నుంచి ఎంత వెడల్పు ఉన్నా 10 అడుగుల మేర సెట్‌బ్యాక్‌ వదలాలి. మిగిలిన మూడు వైపులా వదలనక్కర్లేదు.

* జీ+2కి అనుమతి కావాలంటే..  రోడ్డు వైపు పైన చెప్పిన సెట్‌బ్యాక్‌ నిబంధనే వర్తిస్తుంది. మిగిలిన మూడు వైపుల మాత్రం 1 అడుగు 6 అంగుళాల మేర సెట్‌బ్యాక్‌ వదలాలి.

120-239

జీ+2 భవనం కట్టుకోవచ్చు. రోడ్డు వైపు పైన చెప్పినట్లు సెట్‌ బ్యాక్‌ నిబంధనలు వర్తిస్తాయి. మిగిలిన మూడు వైపుల మాత్రం 3 అడుగుల 3 అంగుళాల మేర స్థలం వదలాలి.

239-359

* జీ+1తోపాటు పార్కింగ్‌ కోసం స్టిల్ట్‌(కింది అంతస్తు) నిర్మించుకోవచ్చు. ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పు 40అడుగులు ఉంటే 7అడుగులు, 40 నుంచి 80 అడుగుల మేర ఉంటే 10 అడుగులు, 80-100 అడుగుల మేర ఉంటే 13 అడుగుల ఒక అంగుళం, 100 అడుగుల కన్నా ఎక్కువ వెడల్పుంటే 16అడుగుల 4అంగుళాల మేర ముందువైపు సెట్‌బ్యాక్‌ వదలాలి. మిగిలిన మూడు వైపుల 3 అడుగుల 3 అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

* స్టిల్ట్‌+జీ+2 నిర్మించాలంటే.. రోడ్డు వైపు రహదారి వెడల్పు ఆధారంగా సెట్‌బ్యాక్‌ వదలాలి. రోడ్డు వెడల్పు 40అడుగులు ఉంటే 7అడుగులు, 40 నుంచి 80అడుగుల మేర ఉంటే 10అడుగులు, 80-100అడుగుల మేర ఉంటే 16అడుగుల 4 అంగుళాలు, 100 అడుగుల కన్నా ఎక్కువ వెడల్పుంటే 19 అడుగుల 74 అంగుళాల మేర సెట్‌బ్యాక్‌ ఉండాలి. మిగిలిన మూడు వైపుల 4అడుగుల 9అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

359-478

* స్టిల్ట్‌+జీ+1 నిర్మించుకోవచ్చు. ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పు 40 అడుగులుంటే 9 అడుగుల 8 అంగుళాలు, 40 నుంచి 60 అడుగుల మేర ఉంటే 13 అడుగుల ఒక అంగుళం, 60-80 అడుగుల రోడ్డుంటే 16 అడుగుల 4 అంగుళాలు, 80-100అడుగుల మేర ఉంటే 19అడుగుల 7 అంగుళాలు, 100అడుగుల కన్నా ఎక్కువుంటే 24అడుగుల 6అంగుళల మేర ముందువైపు సెట్‌బ్యాక్‌ వదలాలి. మిగిలిన మూడు వైపుల 4అడుగుల 9అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

* స్టిల్ట్‌+జీ+3 నిర్మించాలంటే.. ముందు సెట్‌బ్యాక్‌ కోసం రోడ్డు వెడల్పు 40 అడుగులుంటే 9 అడుగుల 8 అంగుళాలు, 40 నుంచి 60 అడుగుల మేర ఉంటే 13 అడుగుల ఒక అంగుళం, 60-80 అడుగుల రోడ్డుంటే 16 అడుగుల 4 అంగుళాలు, 80-100 అడుగుల మేర ఉంటే 19 అడుగుల 7 అంగుళాలు, 100 అడుగులకన్నా ఎక్కువుంటే 24అడుగుల 6 అంగుళాల మేర స్థలం వదలాలి. మిగిలిన మూడు వైపుల ఆరున్నర అడుగుల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

478-598

* స్టిల్ట్‌+జీ+1 నిర్మించాలంటే.. ముందు సెట్‌బ్యాక్‌ కోసం రోడ్డు వెడల్పు 40 అడుగులుంటే 9 అడుగుల 8 అంగుళాలు, 40 నుంచి 60 అడుగుల మేర ఉంటే 13 అడుగుల ఒక అంగుళం, 60-80 అడుగుల రోడ్డుంటే 16 అడుగుల 4 అంగుళాలు, 80-100 అడుగుల మేర ఉంటే 19 అడుగుల 7 అంగుళాలు, 100 అడుగులకన్నా ఎక్కువుంటే 24అడుగుల 6అంగుళాల మేర స్థలం వదలాలి. మిగిలిన మూడు వైపుల ఆరున్నర అడుగుల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

* స్టిల్ట్‌+జీ+3 నిర్మించడానికి.. రోడ్డు వెడల్పు 40 అడుగులుంటే 9 అడుగుల 8 అంగుళాలు, 40 నుంచి 60 అడుగుల మేర ఉంటే 13 అడుగుల ఒక అంగుళం, 60-80 అడుగుల రోడ్డుంటే 16 అడుగుల 4 అంగుళాలు, 80-100 అడుగుల మేర ఉంటే 19 అడుగుల 7 అంగుళాలు, 100 అడుగులకన్నా ఎక్కువుంటే 24అడుగుల 6అంగుళాల మేర ముందు సెట్‌బ్యాక్‌ కోసం స్థలం వదలాలి. మిగిలిన మూడు వైపులా 8 అడుగుల రెండు అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

598 - 897

* స్టిల్ట్‌+జీ+1 నిర్మించడానికి.. రోడ్డు వెడల్పు 40 అడుగులుంటే 9 అడుగుల 8 అంగుళాలు, 40 నుంచి 60 అడుగుల మేర ఉంటే 13 అడుగుల ఒక అంగుళం, 60-80 అడుగుల రోడ్డుంటే 16 అడుగుల 4అంగుళాలు, 80-100 అడుగుల మేర ఉంటే 19 అడుగుల 7 అంగుళాలు, 100 అడుగులకన్నా ఎక్కువుంటే 24అడుగుల 6 అంగుళాల మేర ముందు సెట్‌బ్యాక్‌ కోసం స్థలం వదలాలి. మిగిలిన మూడు వైపులా 8 అడుగుల రెండు అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

* స్టిల్ట్‌+జీ+3 నిర్మించడానికి.. రోడ్డు వైపు వదిలే సెట్‌బ్యాక్‌ పైన పేర్కొన్నట్లే. మిగిలిన మూడు వైపుల 9 అడుగుల 8 అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

* స్టిల్ట్‌+జీ+4 నిర్మించడానికి.. రోడ్డు వైపు వదిలే సెట్‌బ్యాక్‌ పైన పేర్కొన్నట్లే. మిగిలిన మూడు వైపులా 11 అడుగుల 5 అంగుళాల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి.

* 897 చ.గజాలకు మించి విస్తీర్ణంలో రోడ్డు వైపు సెట్‌బ్యాక్‌లు దాదాపు సమానం. భవనం మూడు వైపులా అంతస్తులను బట్టి సెట్‌బ్యాక్‌ నిబంధనలు మారతాయి.

- ఈనాడు, హైదరాబాద్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని