నేటి నుంచి రూ.50వేల జరిమానా 

తెలంగాణ-స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా)లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల నమోదుకు మూడు నెలల గడువు శుక్రవారంతో ముగిసింది. మరో ఒకటి రెండు నెలలు పొడిగించాలని స్థిరాస్తి సంఘాలు కోరినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. నమోదుకు తగినంత సమయం ఇచ్చామని రెరా అధికారులు అంటున్నారు. డిసెంబరు 1 నుంచి నమోదయ్యే ప్రాజెక్ట్‌లకు రూ.50వేల జరిమానా వేస్తున్నామని రెరా కార్యదర్శి కె.విద్యాధర్‌ అన్నారు.   

Published : 01 Dec 2018 02:34 IST

నేటి నుంచి రూ.50వేల జరిమానా 

‘ఈనాడు’తో రెరా కార్యదర్శి కె.విద్యాధర్‌

తెలంగాణ-స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా)లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల నమోదుకు మూడు నెలల గడువు శుక్రవారంతో ముగిసింది. మరో ఒకటి రెండు నెలలు పొడిగించాలని స్థిరాస్తి సంఘాలు కోరినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. నమోదుకు తగినంత సమయం ఇచ్చామని రెరా అధికారులు అంటున్నారు. డిసెంబరు 1 నుంచి నమోదయ్యే ప్రాజెక్ట్‌లకు రూ.50వేల జరిమానా వేస్తున్నామని రెరా కార్యదర్శి కె.విద్యాధర్‌ అన్నారు.                                                             - ఈనాడు, హైదరాబాద్‌

ఎన్ని ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్టర్‌ అయ్యాయి? 
సెప్టెంబరు 1 నుంచి రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదుకు తెలంగాణలో వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. నవంబరు 30వరకు మూడునెలల గడువు ఇచ్చాం. 2100 దరఖాస్తులు రెరాలో రిజిస్టర్‌ అయ్యాయి. 1100 వరకు స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు ఉంటే మరో వెయ్యివరకు ఏజెంట్లు నమోదు చేసుకున్నారు. 
నమోదు చేసుకోవాల్సిన ప్రాజెక్ట్‌లు ఇంకా ఎన్ని ఉంటాయి? 
జనవరి1, 2017 నుంచి అనుమతి పొందిన అన్ని ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి వస్తాయి. అప్పటి నుంచి అనుమతి పొందినవి మూడువేల ప్రాజెక్ట్‌ల వరకు ఉంటాయి. డిసెంబరు 1 తర్వాత కూడా నమోదు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత నమోదు కాబట్టి రూ.50వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 31, 2018 లోపు అనుమతి పొంది నమోదు చేసుకోని వాటికి మాత్రమే జరిమానా విధిస్తాం. 
సెప్టెంబరు 2018 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లకు కూడా  జరిమానా చెల్లించాలా? నేటి నుంచి రూ.50వేల జరిమానా 
అక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్‌లను సాధారణ ఫీజు చెల్లించి రెరాలో నమోదు చేసుకోవచ్చు. 
కొనుగోలుదారులు నిర్మాణ లోపాలపై ఇకపై రెరాకు ఫిర్యాదు చేయవచ్చా? 
ప్రస్తుతం ఫిర్యాదుదారుల మాడ్యుల్‌ను పరీక్షిస్తున్నాం. సిద్ధమయ్యేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది.  ఆ తర్వాత నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత నిర్మాణదారుకు వారం రోజుల నోటీసు జారీ చేసి.. ఇద్దరి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి విచారణ చేపట్టనున్నాం. 
వేర్వేరు రాష్ట్రాల్లో ఫిర్యాదులిలా.. 
హర్యానాలో రెరా కింద 8 నెలల క్రితం ఫిర్యాదులు స్వీకరించడం మొదలెట్టారు. 1800 ఫిర్యాదులు వచ్చాయి. 1200 ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. రోజూ 15 నుంచి 20 ఫిర్యాదులు వస్తున్నాయి. 
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే 8100 ఫిర్యాదులు అక్కడి రెరాకు అందాయి. వీటిలో 2200 ఫిర్యాదులను పరిష్కరించారు. పూర్తి స్థాయి రెగ్యులర్‌ నియామకంతో జనవరి 2019 నాటికి మిగిలిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని చెప్పారు. 
ఉత్తరాఖండ్‌ రెరాకు ఇప్పటివరకు 266 ఫిర్యాదులు వచ్చాయి. 225 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్‌ చేసుకున్నారు. 60 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉండగా.. వీటి పూర్తికి నాలుగు నుంచి ఆరునెలల సమయం పడుతుందని అక్కడి అధికారి తెలిపారు. 
ఫిర్యాదులు మొదట వెళ్లేది ‘రెరా’కే (దేశవ్యాప్త సర్వేలో వెల్లడైన మేరకు ఇలా..)


56% రెరా 
23% నిర్మాణదారు 
7% పోలీసులు12% వినియోగదారుల ఫోరం 
2%న్యాయస్థానం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని