పెరిగిన ఆకాశహర్మ్యాలు

భాగ్యనగరంలో ఎకరా స్థలంలో సగటున నిర్మించే బిల్టప్‌ స్పేస్‌ రెండింతలు పెరిగింది. కార్యాలయ, వాణిజ్య నిర్మాణాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇది గృహ నిర్మాణానికి

Published : 31 Aug 2019 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఎకరా స్థలంలో సగటున నిర్మించే బిల్టప్‌ స్పేస్‌ రెండింతలు పెరిగింది. కార్యాలయ, వాణిజ్య నిర్మాణాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇది గృహ నిర్మాణానికి విస్తరించింది. ఇదివరకు ఎకరా విస్తీర్ణంలో గరిష్ఠంగా లక్షన్నర చదరపు అడుగులు నిర్మాణాలు చేపడితే ఇప్పుడు మూడున్నర లక్షలకు పెరిగింది. హైదరాబాద్‌ పశ్చిమ మార్కెట్‌లో ఎక్కువగా ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో తక్కువ అంతస్తులతో లాభసాటి కావడం లేదని బిల్డర్లు అంటున్నారు. ఇతర నగరాల్లో మాదిరి మనదగ్గర ఇంకా ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)పై ఆంక్షలు లేకపోవడంతో అంతస్తులు పెంచుకుంటూ వెళుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని