అద్దెల పైన రుణం

గృహరుణం తీసుకుని కొందరు ఇల్లు కడితే.. మరికొందరు తాము దాచుకున్న సొమ్ముతో నిర్మాణాలు

Updated : 07 Dec 2019 22:23 IST

ఈనాడు, హైదరాబాద్‌

గృహరుణం తీసుకుని కొందరు ఇల్లు కడితే.. మరికొందరు తాము దాచుకున్న సొమ్ముతో నిర్మాణాలు చేపడుతుంటారు. ఉన్నదంతా భవంతి నిర్మాణంలోనే వెచ్చిస్తుంటారు. మరి అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వస్తే? భవిష్యత్తు అద్దెల మీద రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు ఇప్పుడు వీటిపైన రుణాలు మంజూరు చేస్తున్నాయి. వాణిజ్య, నివాస యాజమాని ఎవరైనా ఈ రుణాలు తీసుకునేందుకు అర్హులే. ఇంటి మరమ్మతులే కాదు పిల్లల చదువు, పెళ్లిళ్లు, వ్యాపార విస్తరణ దేనికైనా వినియోగించవచ్చు. రుణ గ్రహీతల సిబిల్‌ స్కోర్‌ను బట్టి వడ్డీరేటు 10 నుంచి 13 శాతం వరకు వసూలు చేస్తున్నారు. గరిష్ఠంగా పదేళ్లకాలానికి ఈ రుణాలు తీసుకోవచ్చు. అద్దెకిచ్చిన స్థిరాస్తికి సంబంధించిన లీజు ఒప్పందం, రుణ గ్రహీత ఐటీఆర్‌ వంటి పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు ఈ తరహా రుణాలు ఇస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని