నేడు క్రెడాయ్‌ అవార్డుల ప్రదానం

తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో గత రెండేళ్లలో వేర్వేరు విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చిన ప్రాజెక్ట్‌లకు క్రియేట్‌ 2019 (క్రెడాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ అవార్డ్స్‌

Published : 28 Dec 2019 01:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో గత రెండేళ్లలో వేర్వేరు విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చిన ప్రాజెక్ట్‌లకు క్రియేట్‌ 2019 (క్రెడాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ అవార్డ్స్‌ ఫర్‌ తెలంగాణ) పేరుతో నేడు అవార్డులు బహూకరించనున్నారు. స్థిరాస్తి రంగంలో ఆస్కార్‌ అవార్డులుగా పేర్కొంటున్న క్రియేట్‌ను క్రెడాయ్‌ తెలంగాణ 2017లో తొలిసారి మొదలెట్టింది. రెండో ఎడిషన్‌ అవార్డుల ప్రదానం శనివారం ఫిల్మ్‌నగర్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. రెండేళ్లకోసారి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈ వ్యవధిలో అక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చిన ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంది. సుప్రసిద్ధ రేటింగ్‌, రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ ప్రతి ప్రాజెక్ట్‌ను సందర్శించి అత్యుత్తమ డిజైన్‌, ఆవిష్కరణ, అమలు అంశాల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేస్తుంది. వేదికపై ప్రకటించే వరకు ఏ విభాగంలో ఎవరికి అవార్డు వచ్చిందనే విషయం తమకూ తెలియదని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ డెవలపర్లను గుర్తించాలని రియాల్టీ అవార్డులను ఇస్తున్నామన్నారు. అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్ట్‌లు, లేఅవుట్లతో వేర్వేరు విభాగాల్లో అవార్డులు ఉంటాయని తెలిపారు. అవార్డులకు తమ సంబంధిత ప్రాంతాల్లోని సభ్యులందరూ అత్యుత్తమంగా పోటీపడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. 11 ఛాప్టర్లలో 650మందికి పైగా సభ్యులు ఉన్నారన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని