సింగపూర్‌లో హరిత భవనాలిలా..

హరిత భవనాలపై నిర్మాణదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశించినంత పురోగతి లేకున్నా క్రమంగా ఇటువైపు బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. భవన నిర్మాణాల్లో ‘ఆకుపచ్చ, ఎరుపు, నీలం’ ఈ మూడు అంశాలను పాటిస్తే పర్యావరణ

Updated : 04 Jan 2020 02:13 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హరిత భవనాలపై నిర్మాణదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశించినంత పురోగతి లేకున్నా క్రమంగా ఇటువైపు బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. భవన నిర్మాణాల్లో ‘ఆకుపచ్చ, ఎరుపు, నీలం’ ఈ మూడు అంశాలను పాటిస్తే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని సింగపూర్‌లో హరిత భవనాల నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న దిల్లీకి చెందిన అభిమన్యు అంటున్నారు. భారత ప్రధాని కార్యాలయంలో దేశ వ్యర్థాల నిర్వహణపై ఆయన పరిశోధకుడిగా కూడా పనిచేస్తున్నారు. ఈ మూడు రంగుల పద్ధతిని అనుసరిస్తూ నిర్మించే బహుళ అంతస్థుల భవనాలతో పర్యావరణహితంగా మారొచ్చు అని చెబుతున్నారు.

ఏంటా మూడు రంగులు..?
ఆకుపచ్చ : ప్రగతి పేరిట ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ప్రాణవాయువుకు కొద్దికొద్దిగా దూరమవుతున్నాం. ఇప్పుడు దానికి దగ్గరవ్వాల్సిన సమయమొచ్చింది. నిర్మించే ప్రతి భవనంలోనూ పచ్చదనం ఉట్టిపడాలి. ఇది మారుతున్న పర్యావరణ సమతుల్యతలో కీలకపాత్ర పోషిస్తుంది. భవనం నిర్మించేటప్పుడు కేవలం చెట్టు పెంచామనే కాకుండా ఎలాంటి వాటితో ప్రయోజనముంటుందో ముందే తెలుసుకుని పెంచడం మేలు. ఇది ఆరోగ్యదాయినిగా ఉపయోగపడుతుంది. ఫలితంగా చల్లదనం కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏసీలు అక్కర్లేదు.

నీలం : ఈ రంగు నీటిని సూచిస్తుంది. భవనంలో వాడిన నీరు, వర్షపు నీటిని పునర్వినియోగానికి ఉపయోగపడేలా ఏర్పాట్లు చేయాలి. నీటి వృథాని అరికట్టడం ద్వారా పర్యావరణానికి సహకరించిన వాళ్లమవుతాం.

ఎరుపు : ఇది పూర్తిగా ఖాళీ స్థలం కోసం.. బహుళ అంతస్థుల నిర్మాణాల్లో ఓ ఫ్లోర్‌ ఎలాంటి నిర్మాణం లేకుండా ఖాళీ వదిలేయాలి. ఇది స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేందుకు ఉపయోగపడుతుంది.  సింగపూర్‌లోని అన్ని బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి దుకాణ సముదాయం, పెద్ద భవంతిలో మొదటి, కింది ఫ్లోర్‌ పూర్తిగా ఖాళీగా ఉంచుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని