ఎంతదూరంలో కొనొచ్చు...

నగరాల్లో ఇప్పటికీ చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి దీర్ఘకాలం మదుపు మేలు చేస్తుందని

Updated : 25 Jan 2020 06:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరాల్లో ఇప్పటికీ చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి దీర్ఘకాలం మదుపు మేలు చేస్తుందని అంటున్నారు. వీరిలో అధిక శాతం మంది ఇంటిని కొనే లక్ష్యంతో ఉన్నారు. తమ అవసరాలు తీరుస్తూనే అందుబాటు ధరల్లో ఉండే నిర్మాణాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలపై ఆధారపడిన వారు పని ప్రదేశానికి 45 నిమిషాల్లోపు చేరుకునే ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరంలో పని ప్రదేశాలకు చేరువలో ఇళ్లకు డిమాండ్‌ను సూచిస్తోంది. ఐటీ కారిడార్‌లో కూకట్‌పల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో నివాసానికి ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. మాదాపూర్‌కు ఈ ప్రాంతం చాలా దగ్గర. అరగంటలో చేరుకునే సౌలభ్యం ఉండేది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పెరగడం.. గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి ప్రాంతాలకు ఐటీ విస్తరించడంతో.. అక్కడి నుంచి అరగంటలో గమ్యస్థానం చేరుకునే నివాస ప్రాంతాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పని ప్రదేశానికి సమీపంలో అంటే డిమాండ్‌ అధికంగా ఉంటుంది కాబట్టి ధరలు ఎక్కువే ఉంటాయి. అక్కడి నుంచి క్రమంగా దూరం వెళ్లే కొద్దీ ధరలు తగ్గతూ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు