పర్యావరణ అనుమతులకు ఎదురు చూపులు!
ఈనాడు, హైదరాబాద్: భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. చాలాకాలం తర్వాత రాష్ట్రంలో పర్యావరణ కమిటీ ఏర్పాటైనా అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. త్వరగా లభించేలా చూడాలని క్రెడాయ్ హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రియల్ ఎస్టేట్ సమస్యలపై నెలవారీ సమావేశంలో భాగంగా ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో క్రెడాయ్ హైదరాబాద్ కార్యవర్గం, సభ్యులు సమావేశమయ్యారు. కొవిడ్ అనంతర పరిణామాలు, స్థిరాస్తి రంగం వృద్ధి, సంస్కృరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొవిడ్ లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు కొనసాగించలేని పరిస్థితుల్లో అనుమతి ఉన్న ప్రాజెక్ట్‌ల గడువును సర్కారు గతంలోనే పొడిగించింది. పొడిగించిన ఈ గడువు వర్తించాలంటే ఆన్‌లైన్ దరఖాస్తు పరంగా ఎదురవుతున్న ఆటంకాలు, టీఎస్‌బీపాస్‌లో పెద్ద ప్రాజెక్ట్‌లకు నిరభ్యంతర పత్రాలను సమర్పించడంలో ఉన్న ఇబ్బందులను సభ్యులు ఎకరవు పెట్టారు. పర్యావరణ కమిటీ నుంచి అనుమతులు ఆలస్యం అవుతున్నాయనే విషయాన్ని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ముందే బుకింగ్‌లతో జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలతో మార్కెట్‌పై పడుతున్న ప్రభావంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే అలాంటి ప్రాజెక్ట్‌ల్లో కొన్నవారిని ఎవరూ కాపాడలేరని అన్నారు. ఈ అవాంచిత పోకడలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Hardik Pandya: టీమ్ఇండియా టీ20 సారథిగా హార్దిక్ కొత్త రికార్డు
-
Movies News
Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
-
General News
HMDA: ప్రారంభమైన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ
-
India News
India Corona: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు..
-
General News
Telangana news: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. తప్పిన ప్రమాదం
-
Business News
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 700+
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన