అంతెత్తున ఇల్లు.. ఏది మేలు!

ఎటు చూసినా ఆకాశహర్మ్యాలు.. బహుళ అంతస్తులు.. కొన్నేళ్ల క్రితం వరకూ ఐదారు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఎక్కడ ఉండాలనే ఆలోచన అయోమయానికి గురిచేసింది. ప్రస్తుతం 20, 30, 40, 50 అంతస్తుల భవనాలు

Updated : 06 Nov 2021 06:14 IST

* ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లయితే మధ్య అంతస్తు ఉత్తమం.
* సానుకూల, ప్రతికూలత సమంగా ఉంటాయి.
* కిటికీల అమరిక పకడ్బందీగా ఉంటే ధ్వని కాలుష్యం ఉండదు.

ఈనాడు, హైదరాబాద్‌: ఎటు చూసినా ఆకాశహర్మ్యాలు.. బహుళ అంతస్తులు.. కొన్నేళ్ల క్రితం వరకూ ఐదారు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఎక్కడ ఉండాలనే ఆలోచన అయోమయానికి గురిచేసింది. ప్రస్తుతం 20, 30, 40, 50 అంతస్తుల భవనాలు విస్తరిస్తున్నాయి. కూకట్‌పల్లి మాదాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నార్సింగి, కోకాపేట్‌, కొండాపూర్‌లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో కొనుగోలుదారుల్లో చాలామందికి ఇది కొత్త అనుభవం. అందుకే.. వీటిలో ఎక్కడ ఉండాలి.. ఏ అంతస్తు ఉత్తమం అనే ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ ఉండే ప్రతికూల, సానుకూల అంశాలను చూసి.. కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకుని ఎంపిక చేసుకోవాలని నిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

దిగువున..

* అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అయితే కింద అంతస్తు ఉత్తమం. గ్రామీణ వాతావరణంలో ఉన్న భావన కలుగుతుంది.

* అయితే చుట్టూ నిర్మాణాలతో గాలి, వెలుతురు పరిమితం.

ఎగువన ఎంతహాయి..

* ఎంత ఎత్తులో ఉంటే.. అంతటి సామాజిక హోదా అనే నానుడి.ః సాయంత్రం అలా బాల్కనీలో కూర్చుని చుట్టూ ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఎగువ అంతస్తు బావుంటుంది.

* కాలుష్యానికి, దోమలకు దూరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని