Published : 04 Dec 2021 04:29 IST
రియల్ దూకుడు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడు కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వ వేలంలో, అటు ప్రైవేటు అమ్మకాల్లోనూ స్థలాలు, ఇళ్లు భారీ ధరలు పలికాయి. హెచ్‌ఎండీఏ తాజాగా నిర్వహిస్తున్న వేలంలో ఉప్పల్ భగాయత్‌లో గరిష్ఠంగా చదరపు గజం లక్ష రూపాయలు పలకగా.. ఇటీవల జూబ్లీహిల్స్‌లో విక్రయించిన ఒక స్థలంలో చదరపు గజం మూడు లక్షలు దాటింది. నగరంలో ప్రముఖులు నివాసముండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో స్థలాల లభ్యత తగ్గిపోతుండటంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొవిడ్ తర్వాత పెద్ద ఎత్తున స్థిరాస్తులు చేతులు మారుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఒక ప్రముఖ స్థిరాస్తి సంస్థ ఎండీ 1368 చదరపు అడుగుల విస్తీర్ణంలోని బంగ్లాను రూ.37 కోట్లకు కొన్నారు. గత నెలలో 841 చదరపు గజాల స్థలాన్ని మరో ప్రముఖ పాఠశాల యాజమాని రూ.26 కోట్లు వెచ్చించి కొన్నారు.
Advertisement
Tags :