ఆ ఒక్కరోజు నిర్మాణాలు బంద్
స్టీలు, సిమెంట్ ధరల పెంపునకు నిరసనగా రియల్ ఎస్టేట్ సంఘాల నిర్ణయం
ఈ నెల 4న కన్స్ట్రక్షన్ హాలిడే ప్రకటించిన క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ
ఈనాడు, హైదరాబాద్: ‘స్టీలు ధరలు కొవిడ్ అనంతరం వంద శాతం పెంచారు. ప్రస్తుతం టన్ను ధర రూ.80వేల నుంచి 90వేల మధ్య ఉంది. సిమెంట్ ధరలు 50 శాతం వరకు పెంచారు. ఇతర ముడిసరకుల ధరలు 30 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా స్టీలు, సిమెంట్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచడాన్ని నిరసిస్తూ.. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ నెల 4న తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణాలు నిలిపివేస్తున్నాం. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం తరఫున నిరసన తెలపాలని నిర్ణయించాం. ఆ రోజున కన్స్ట్రక్షన్ హాలిడేగా ప్రకటించాం’ అని తెలంగాణలోని నాలుగు ప్రధాన రియల్ ఎస్టేట్ సంఘాలు క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంయుక్తంగా ప్రకటించాయి. స్థానికంగా ఉన్న నిర్మాణ సంఘాలు సైతం బంద్‌కు సంపూర్ణ మద్దదు ప్రకటించాయి. సిటీలో 600 పైగా ఉన్న డెవలపర్లు ఆరోజు నిర్మాణాలు చేపట్టవద్దని నిర్ణయించారు. జిల్లాల్లోనూ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పనుల్లో మూడు నుంచి నాలుగు లక్షల మంది నిర్మాణ కూలీలు పనిచేస్తున్నట్లు అంచనా. బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ హైదరాబాద్ కార్యాలయంలో శుక్రవారం సమావేశమైన సంఘాల అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు.
నిర్మాణాలు కొనసాగించలేని పరిస్థితి - సీహెచ్ రాంచంద్రారెడ్డి, ఛైర్మన్, క్రెడాయ్ తెలంగాణ
స్టీలు ధర కొవిడ్ తర్వాత చూస్తే వంద శాతం పెరిగింది. దీనివల్ల చ.అ.కు రూ.160 అదనపు భారం పడుతుంది. సిమెంట్, ఇతర ముడిసరుకుల పెరుగుదల కలిపి చ.అ.కు రూ.320 వరకు అదనపు వ్యయం అవుతోంది. దీంతో నిర్మాణాలు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలి - డి.మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ
అసాధారణ ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నియంత్రించాలి. నిర్మాణ రంగంపై ప్రభావం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలి. అన్నింటిపై కుదరకపోతే అపార్ట్మెంట్ల వరకైనా తగ్గించాలి.
స్టీలు ఎగుమతి ఆపాలి- పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్
* స్టీల్ ఉత్పత్తికి సంబంధించి ఇంధనం మినహా ముడిసరుకులన్నీ భారత్‌లోనే దొరుకుతున్నాయి. ఏరకంగా చూసినా పెరుగుదల 30 శాతం మించొద్దు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రాత్రికి రాత్రే పెంచేశారు. వందశాతం పెంపుదలలో సహేతుకత లేదు.
* పలు రంగాల్లో నియంత్రణ సంస్థలు ఉన్నట్లు స్టీలు, సిమెంట్ రంగానికి రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలి. స్టీలు ఎగుమతులను కొంతకాలం ఆపాలి. లేకపోతే టన్ను స్టీలు రూ.లక్షకు చేరితే సామాన్య, మధ్యతరగతివాసులు ఎలా ఇళ్లు కట్టుకోగలుగుతారు.
జీఎస్టీ తగ్గించాలి - సునీల్‌చంద్రారెడ్డి, అధ్యక్షుడు, ట్రెడా
* సిమెంట్‌పై అత్యధికంగా 28 శాతం, స్టీల్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వీటిని తగ్గించాలి. ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి.
* స్టీలు దిగుమతులపై 7.5 శాతం సుంకం విధిస్తున్నారు. కొంతకాలం పాటు దీన్ని తొలగించాలి
దిక్కుతోచని పరిస్థితి - సి.ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, టీబీఎఫ్
* నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తిచేసేనాటికి సాధారణంగా ముడిసరుకుల ధరల పెరుగుదల ఐదు నుంచి పది శాతం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే భూయజమానితో ఒప్పందాలు, ప్రారంభంలో విక్రయాలు చేపడతారు. నెలల వ్యవధిలో 50 శాతం పెరిగితే దిక్కుతోచని పరిస్థితి.
* కొవిడ్ కంటే ఇది పెద్ద సమస్య. ఎంతో మంది ఉపాధితో ముడిపడిన రంగం. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.
ఇన్‌ఫుట్ కాస్ట్‌ను సర్దుబాటు చేయాలి - జి.వి.రావు, అధ్యక్షుడు, టీడీఏ
* కొత్త రాష్ట్రం భయాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా, కొవిడ్ వంటి ఒడుదొడుకులను అధిగమిస్తూ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదురుకుంది. వీటన్నింటి కంటే నిర్మాణ ముడిసరకుల ధరలు అమాంతంగా పెరగడం ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది.
* జీఎస్టీలో ఇన్‌ఫుట్ కాస్ట్ సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలి.
బంద్ ప్రభుత్వ విధానాలపై కాదు.. - వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్ హైదరాబాద్
* రియల్ ఎస్టేట్ సంఘాలు 4వ తేదీన ఇచ్చిన బంద్ పిలుపు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాదు. స్టీలు, సిమెంట్ ధరల అసాధారణ పెంపుపై మా నిరసన ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో క్రెడాయ్ కన్స్ట్రక్షన్ హాలిడే చేపట్టింది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు
-
Politics News
Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా
-
Sports News
IND vs ENG : మూడో రోజూ వర్షం అడ్డంకిగా మారే అవకాశం.. అయినా ఇంగ్లాండ్‌కే నష్టం!
-
Crime News
Suicide: చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
BJP: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చేయాలి తప్ప ఇలానా?: భాజపా నేత ఇంద్రసేనారెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)