ఇప్పుడు ఏది మేలు?

ఇల్లు నిర్మాణంలో ఉండగా కొంటే మేలా? పూర్తైన ఇల్లు తీసుకోవడం ఉత్తమమా? ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులకు ఏది కలిసి వస్తుంది? స్థిరాస్తి మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తుంటాయి. ప్రారంభంలో కాబట్టి....

Published : 09 Apr 2022 02:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లు నిర్మాణంలో ఉండగా కొంటే మేలా? పూర్తైన ఇల్లు తీసుకోవడం ఉత్తమమా? ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులకు ఏది కలిసి వస్తుంది? స్థిరాస్తి మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తుంటాయి. ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్‌, దిక్కుతో పాటూ ప్రారంభంలో ధర కూడా తక్కువే ఉంటుంది.

ఇల్లును తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలోనే ఇటువంటి వెసులుబాటు ఉంటుంది.

ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలుదారి ఆస్తి విలువ పెరిగినట్లే. వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

గడువులోపు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయకపోవడం వంటి సమస్యలు లేకపోలేదు. నిర్మాణదారుడు ఎంతకాలంలో పూర్తిచేయగలడనేది కొనేముందు చూడాలి. చెప్పిన సమయానికి ఇచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.  

గృహరుణం ద్వారా కొనుగోలు చేసినట్లయితే నిర్మాణ సమయం నుంచే ఈఎంఐ చెల్లించాల్సి రావడం చాలామందికి భారం. ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యేకొద్దీ ఒకవైపు ఈఎంఐ, మరోవైపు ఇంటి అద్దె చెల్లించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాటిని చూసుకోవాలి.

సిద్ధంగా ఉన్నవాటిలో కొంటే ..

ఎదురుచూపులు ఉండవు. కొన్నవెంటనే గృహప్రవేశం చేయవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో సిద్ధంగా ఉన్నవాటి ధరలే తక్కువగా ఉన్నాయి. ముడిసరకుల ధరల దృష్ట్యా కొత్త ప్రాజెక్టుల్లోనే ఎక్కువ ధరలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిద్ధంగా ఉంటే..  వాటిలో కొనడం మేలు.

కొన్నిసార్లు ప్రాజెక్ట్‌లో ఒకటి అరా మిగిలిపోతుంటాయి. నిర్మాణదారు ఆర్థిక అవసరాలను బట్టి.. కొన్నిసార్లు తక్కువ ధరకు కూడా వస్తుంది.

వీటిలో కొనుగోలుకు ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాలి. వాయిదాల అవకాశం ఉన్నా స్వల్పకాలం మాత్రమే.

ఇంట్లో టైల్స్‌గానీ, ఇతరత్రా ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. ఒకవేళ మార్పులు చేసుకుంటే అదనపు ఖర్చు సొంతంగానే భరించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని