పాత ఇల్లు కొనేద్దాం

నగరంలో ప్రస్తుతం చాలావరకు పాత ఇళ్లు, ఫ్లాట్లు అమ్మకానికి కనిపిస్తున్నాయి.. కొత్త వాటి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పాతవాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడా ధరలే కీలక నిర్ణయాంశమవుతోంది.

Updated : 23 Apr 2022 06:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ప్రస్తుతం చాలావరకు పాత ఇళ్లు, ఫ్లాట్లు అమ్మకానికి కనిపిస్తున్నాయి.. కొత్త వాటి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పాతవాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడా ధరలే కీలక నిర్ణయాంశమవుతోంది.

నగరంలో ఇప్పుడే కాదు పాత ఇళ్ల అమ్మకాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువగా అమ్మకానికి వస్తుంటాయంతే. గృహ రుణాలు చెల్లించలేకపోవడం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం, పెద్ద ఇంటికి మారడం, నగరాన్ని వదిలేసి వెళుతుండటం, విదేశాల వంటి కారణాలతో పాత ఇళ్లు విక్రయానికి వస్తుంటాయి.

* పాత ఇళ్లని చాలామంది చిన్నచూపు చూస్తుంటారు. కానీ నిర్మాణం బాగున్న అపార్ట్‌మెంట్లలో ఈ తరహా ఇళ్లను కొనుగోలు చేయవచ్చు.

* సహజంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఎక్కువగా పాత ఇళ్లు అమ్మకానికి వస్తుంటాయి. అటువంటి చోట కొత్త ఇల్లు కొనుగోలు అందరికీ సాధ్యపడకపోవచ్చు. చ.అ. ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అదే పాత ఇల్లు అయితే బడ్జెట్‌లో వస్తుంది.

* ఎన్నేళ్ల కిందట భవనాన్ని నిర్మించారనే దాన్ని బట్టి ధర ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌తో ఒకసారి పరిశీలించుకుంటే మంచిది.

* చూడటానికి కొన్ని ఇళ్లు పురాతనంగా కనిపిస్తాయి. సరైన నిర్వహణ లేక అలా ఉంటాయి. కట్టడం నాణ్యంగా ఉంటే వీటిని మరో ఆలోచన లేకుండా కొనుగోలు చేయవచ్చు అంటున్నారు ఇంజినీర్లు. రంగులేస్తే కొత్తదానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఈ ఖర్చుంతా లెక్కలేసుకుని బేరమాడవచ్చు.

* తమ అవసరాలను బట్టి ఒకటి, రెండు, మూడు పడక గదుల ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయవచ్చు.

* న్యాయపరమైన చిక్కులు లేకుండా.. పార్కింగ్‌ సదుపాయం అన్నీ పక్కాగా ఉంటే ఎంచక్కా ఇంటివారైపోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని