ధరలు పెరిగినా.. విస్తీర్ణంలో రాజీ లేదు

కొత్త ఇంటి విస్తీర్ణంలో కొనుగోలుదారులు రాజీపడటం లేదు. సిటీకి దూరమైనా సరే విశాలమైన ఇల్లే కావాలంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇది మరింత స్పష్టంగా

Published : 21 May 2022 02:53 IST

ఈనాడు, హైదరాబాద్‌ : కొత్త ఇంటి విస్తీర్ణంలో కొనుగోలుదారులు రాజీపడటం లేదు. సిటీకి దూరమైనా సరే విశాలమైన ఇల్లే కావాలంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇది మరింత స్పష్టంగా కనిపించింది. వెయ్యి చదరపు అడుగుల లోపు ఇళ్లు  కొనేవారి శాతం గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 4 శాతం తగ్గింది.  ఈ విభాగంలో ఇళ్లు కొనేవారి కొనుగోలు శక్తి తగ్గడం కూడా ఒక కారణమై ఉండొచ్చు అని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి.

* ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌ రాజధాని ప్రాంతమైన హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్లను చూస్తే వెయ్యి నుంచి 2వేల చ. అ. విస్తీర్ణం కలిగిన ఇళ్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వీటి శాతమే 72గా ఉంది. గతేడాది కంటే ఇది 3 శాతం అధికం.

* 2వేల నుంచి 3వేల మధ్యలో ఉండే విలాసమైన ఇళ్ల వాటా సైతం ఒక శాతం పెరిగింది. గతేడాది ఏప్రిల్‌లో 8 శాతం ఉంటే  ఈసారి 9కి పెరిగింది.

* 3వేల చ.అ.విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో మార్పు లేదు. వీటి వాటా 2 శాతంగా ఉంది.  ః అల్పాదాయ వర్గాలు కొనుగోలు చేసే 500 చదరపు అడుగుల లోపు ఆవాసాల రిజిస్ట్రేషన్లు కేవలం 3 శాతంగా ఉన్నాయి. వీటిలోనూ ఎలాంటి మార్పులేదు.

అనూహ్యంగా...
ఇళ్ల కొనుగోలు ధర ఏడాదిలో సగటున 20 శాతం పెరిగింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని 36 శాతం వృద్ధి నమోదైంది.

* హైదరాబాద్‌ జిల్లాలో ఏప్రిల్‌లో చ.అ. రిజిస్ట్రేషన్‌ ధర రూ.4087గా ఉంది. గతేడాది కంటే ఇది 20 శాతం అధికం.

* మేడ్చల్‌ మల్కాజిగిరిలో సగటు చ.అ. ధర రూ.2909 (రిజిస్ట్రేషన్‌ ప్రకారం)గా ఉంది. ఇక్కడ 27 శాతం ధరలు పెరిగాయి.

* రంగారెడ్డి జిల్లాలో సగటు చ.అ.ధర రూ.4242గా నమోదైంది. పెరుగుదల 14 శాతం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని