ఏకగవాక్ష విధానంపై పట్టు! 

ఎన్నికల వేళ ఆయా వర్గాలు తమ సమస్యలను పార్టీల ముందుంచుతుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. నిర్మాణ రంగానికి సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను స్థిరాస్తి సంఘాలు పార్టీల దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇటీవల పురపాలక శాఖ మంత్రి, తెరాస ముఖ్య నాయకుడు కేటీఆర్‌తో సమావేశమైన పలు సంఘాలు...

Published : 17 Nov 2018 02:08 IST

పార్టీలకు రియల్‌ ఎస్టేట్‌ రంగం వినతి 
ఈనాడు, హైదరాబాద్‌

ఏకగవాక్ష విధానంపై పట్టు! 

న్నికల వేళ ఆయా వర్గాలు తమ సమస్యలను పార్టీల ముందుంచుతుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. నిర్మాణ రంగానికి సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను స్థిరాస్తి సంఘాలు పార్టీల దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇటీవల పురపాలక శాఖ మంత్రి, తెరాస ముఖ్య నాయకుడు కేటీఆర్‌తో సమావేశమైన పలు సంఘాలు తమ సమస్యలను విన్నవించాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా వీటిని పరిష్కరించాలని కోరుతున్నాయి. 
ఏకగవాక్ష విధానంపై పట్టు! ఎల్‌ఆర్‌ఎస్‌ను దాదాపు పూర్తయింది. కొన్ని సమస్యలు ఉన్నా చాలావరకు అక్రమ స్థలాలను క్రమబద్ధీకరించారు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ(బీఆర్‌ఎస్‌) మాత్రం కోర్టు కేసుతో నిలిచిపోయింది. దానిని పరిష్కరించి బీఆర్‌ఎస్‌ను పూర్తి చేయాలి. 
చాలా సంవత్సరాలుగా భూముల రిజిస్ట్రేషన్ల విలువను సర్కారు సవరించలేదు. మార్కెట్‌ ధరలకు వీటికి చాలా అంతరం ఉంది. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లనే తీసుకుంటే ఉప్పల్‌ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ ధర రూ.1,400 ఉంటే మార్కెట్‌ రేటు రూ.3 వేల పైనే. కొన్నిచోట్ల రూ.4 వేల వరకు ఉంది. రిజిస్ట్రేషన్‌ ధరలను సవరించి స్టాంప్‌డ్యూటీని ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయంలో ఎలాంటి లోటు ఉండదు. వెంటనే దీన్ని అమలు చేయాలి. 
ప్రస్తుతం లేఅవుట్లు, భవన నిర్మాణాలకు వేర్వేరు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. రెవెన్యూ, అగ్నిమాపక, విమానాశ్రయ, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక సంస్థలు, ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఇందుకు చాలా సమయం పడుతోంది. ఒక దరఖాస్తు ఇస్తే ప్రభుత్వమే ఆయా శాఖల నుంచి అనుమతి ఇచ్చేలా ఏకగవాక్షం(సింగిల్‌ విండో) విధానాన్ని తక్షణం ప్రవేశపెట్టాలి. 
నిర్మాణదారుల నుంచి కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సుంకం వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వీటిని ఖర్చు చేయాలి. ప్రమాదాలు జరిగితే నిర్మాణదారుడికి భారం కాకుండా కార్మికులందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలి. 
భవన నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. ఎక్కువగా ఉత్తరాది వారు ఈ రంగంలో ఉన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి. 
పశ్చిమ హైదరాబాద్‌ వైపే అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతం అయింది. నగరంలోని అన్ని వైపులకూ అభివృద్ధి విస్తరించేలా సర్కారు తీసుకునే నిర్ణయాలు ఉండాలి. 
నగరం చుట్టుపక్కల వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు మాదిరి ఆయా ప్రాంతాల్లోనూ పచ్చదనం, పార్కులను అభివృద్ధి చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు