రెరాతో మారిన ఇంటి కొలతలు 

మీ ఇంటి విస్తీర్ణం ఎంత అని అడిగితే 1020 చదరపు అడుగులు అని చెప్పేవారు. వాస్తవంగా ఇంటిలోపల విస్తీర్ణం 830 చ.అ.మించదు.  కారిడార్‌....

Published : 23 Mar 2019 06:29 IST

ఈనాడు, హైదరాబాద్‌:

మీ ఇంటి విస్తీర్ణం ఎంత అని అడిగితే 1020 చదరపు అడుగులు అని చెప్పేవారు. వాస్తవంగా ఇంటిలోపల విస్తీర్ణం 830 చ.అ.మించదు.  కారిడార్‌, మెట్లు, లిఫ్ట్‌ స్థలం అన్నీ కలిపి సూపర్‌ బిల్టప్‌ పేరుతో బిల్డర్లు విక్రయించేవారు.  కామన్‌ ఏరియా, కార్పెట్‌ ఏరియా తెలిసేది కాదు. వెయ్యి చదరపు అడుగులపైన అంటే చిన్న కుటుంబానికి సరిపోతుందని కొనుగోలు చేస్తే.. తీరా ఇంట్లోకి దిగాక అసలు విస్తీర్ణం తక్కువై ఇరుకుగా అనిపించేది. ఇలాంటి ఇబ్బందుల దృష్ట్యా కొనుగోలుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా)లో విడివిడిగా చూపాలని పేర్కొన్నారు. రెరాలో నమోదై ఇటీవల నిర్మాణాలు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కార్పెట్‌ ఏరియా, ఫ్లింత్‌ ఏరియా, కామన్‌ ఏరియాను విడివిడిగా చూపిస్తున్నారు. మూడు కలిపి సూపర్‌బిల్టప్‌ ఏరియాగా విక్రయిస్తున్నారు.

* కార్పెట్‌ ఏరియా: ఫ్లాట్‌లో బయటి గోడలు, బాల్కనీలు, వాష్‌ ఏరియాను మినహాయించి లోపల ఉన్న విస్తీర్ణాన్ని కార్పెట్‌ ఏరియాగా చూపిస్తున్నారు. 
* ఫ్లింత్‌ ఏరియా: స్లాబ్‌ ఏరియానే ఫ్లింత్‌ ఏరియా చెబుతుంటారు. ఫ్లాట్‌ లోపలి విస్తీర్ణంతోపాటూ బయటి గోడలు, బాల్కనీలు, వాష్‌ ఏరియా పూర్తిగా ఇందులోకి వస్తుంది. 
* కామన్‌ ఏరియా: కారిడార్‌, మెట్లు, లిఫ్ట్‌ స్థలాన్ని ప్రతి ఫ్లోర్‌కు లెక్కిస్తున్నారు. 
లిఫ్ట్‌, మెట్ల హెడ్‌రూమ్స్‌, వాటర్‌ట్యాంక్స్‌, వాటర్‌ సంప్స్‌, వాచ్‌మెన్‌ గదిని కూడా కామన్‌ ఏరియాలో కలిపేస్తున్నారు

ఉదాహరణకు.. 
* ఇటీవల మొదలైన ఒక ప్రాజెక్ట్‌లో రెండు పడకల ఫ్లాట్‌ 1105 చ.అ.సూపర్‌బిల్టప్‌ ఏరియా అయితే..  కార్పెట్‌ ఏరియా 760 చ.అ., ఫ్లింత్‌ ఏరియా 920 చ.అ., కామన్‌ ఏరియా 185 చ.అ.గా చూపించారు. 
* మూడు పడకల ఫ్లాట్‌ అయితే సూపర్‌బిల్టప్‌ ఏరియా 1956 చ.అ. ఇందులో 1365 చ.అ. కార్పెట్‌ ఏరియా, 1630 చ.అ. ఫ్లింత్‌ ఏరియా,  326 చ.అ. కామన్‌ ఏరియాగా చూపిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని