Updated : 04 Sep 2021 04:42 IST

ఇల్లు కొనేటప్పుడు ఏం చూస్తున్నారు?

ఈనాడు, హైదరాబాద్‌

ఇల్లు, ప్లాట్ల కొనుగోలుదారులకు బిల్డర్లు, రియల్టర్ల నుంచి మిశ్రమ అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు చెప్పిన ప్రకారం పనులు పూర్తి చేసి యజమానికి స్థిరాస్తిని అప్పగిస్తే.. మరికొందరు  ప్రాజెక్టు ఆఖరులో పనులన్నీ వదిలేసి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ అనుభవాలతో కొనుగోలుదారులు డెవలపర్‌ విశ్వసనీయతను ప్రధానంగా చూస్తున్నారు. కొత్త ఇంటిని, ప్లాట్‌ను ఎంపిక చేసుకునే సమయంలో గతంలో చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేశారా? చెప్పినవన్నీ సమకూర్చారా? నాణ్యంగా చేపట్టారా లేదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్వసనీయతను బేరీజు వేసుకుంటున్నారు.

స్థిరాస్తుల కొనుగోలులో ప్రతి ఒక్కరిది ఒక్కో అనుభవం. లేఅవుట్‌లో స్థలం కొనుగోలు చేస్తే రెండేళ్లు గడుస్తున్నా అందులో సౌకర్యాలను సమకూర్చడం లేదు కొందరు రియల్టర్లు. పాత వెంచర్‌ను వదిలేసి కొంత వెంచర్‌పై దృష్టి పెడుతున్నారు. వినియోగదారులు ఎన్నిసార్లు అడిగినా చేస్తాం అంటారు తప్ప పనులను పూర్తి చేయరు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే.. ఇస్తామన్న గడువు పూర్తయినా ఇల్లు మాత్రం సిద్ధం కాదు. పనులు చేయించాల్సిన బిల్డరు పత్తా లేకుండా పోతున్నారు. ఏం చేయాలో తెలియక కొనుగోలుదారులు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. నాసిరకమైన నిర్మాణాలతో మరి కొందరు మోసం చేస్తున్నారు. వాన పడితే గోడల నుంచి నీరు వస్తోందని వాపోతున్నారు. మూసీ నది పక్కన సెల్లార్లు తవ్వితే వానాకాలంలో నీరు ఊబికి వచ్చి అది మునుగుతుందని బిల్డరుకు తెలిసినా.. సెల్లార్ల నిర్మాణం చేపట్టి ఫ్లాట్లను అమ్ముకుని చేతులు దులుపుకొంటున్నారు. ఇవేవీ తెలియని కొనుగోలుదారులు ఆయా సంస్థలు, నిర్మాణదారు మాటలను నమ్మి కొనుగోలు చేసి తర్వాత చింతిస్తున్నారు. దీంతో వారు అప్రమత్తం అవుతున్నారు. ఇల్లు కొనేటప్పుడు మొదట ఏం చూడాలనే దానిపై కుండ బద్దలు కొట్టినట్లు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. అనరాక్‌ సంస్థ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సర్వే చేపట్టగా ధరలతో పాటూ డెవలపర్‌ విశ్వసనీతయకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అమ్మకం తర్వాత ఏ మేరకు తమకు సేవలు అందిస్తున్నారనేది కూడా ప్రధానంగా చూస్తున్నారు.

ఏ వర్గాలు కొంటున్నాయ్‌..

స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడంలో తరాల అంతరం స్పష్టంగా కన్పిస్తోంది. 23 ఏళ్లలోపు జనరేషన్‌ జెడ్‌లో ఇల్లు కొనుగోలు మూడో ప్రాధాన్యంగా ఉంటే... 23 నుంచి 38 ఏళ్ల మధ్యనున్న మిలీనియల్స్‌ మాత్రం ఇంటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇల్లు కొనుగోలు పరంగా చూస్తే..

స్పష్టమైన అభిప్రాయాలతో..

కొవిడ్‌ అనంతరం కొనుగోలుదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైన వారికి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి నుంచి పని, ఈ-స్కూలింగ్‌ల వల్ల వెలుతురు బాగా వచ్చే ఇళ్లను, సకాలంలో పూర్తయ్యే ప్రాజెక్టు, నాణ్యమైన పనులు చేసే సంస్థల ఎంపికకు ప్రాధాన్యం అంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని