Updated : 30 Oct 2021 06:23 IST

హైటెక్స్‌లో నేటి నుంచి ‘ఈనాడు’ ప్రాపర్టీ షో

ఫ్లాట్లు, విల్లాలు, స్థలాల ప్రాజెక్టులన్నీ ఒకే చోట

ఈనాడు, హైదరాబాద్‌

ల్లు కొనేందుకు ఇది అనువైన సమయమా? అవుననే అంటున్నారు స్థిరాస్తి రంగ నిపుణులు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీకి ప్రస్తుతం బ్యాంకులు గృహ రుణాలు ఇస్తున్నాయని... ఎక్కువ మొత్తం రుణ లభ్యతతో కలల గృహాన్ని కొనుగోలు చేయవచ్చు అని సూచిస్తున్నారు. రుణం సరే.. మరి ఇంత తక్కువ సమయంలో స్థిరాస్తి ఎంపిక అంటారా? సిటీలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులన్నింటినీ ఒకేచోటుకు తీసుకొస్తోంది ‘ఈనాడు’ ప్రాపర్టీ షో’. శని, ఆదివారాల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో  ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు దీనిని నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. 

కొవిడ్‌ తర్వాత సొంత ఇంటి అవసరం పెరిగింది. అద్దె ఇంట్లో ఉంటున్నవారు సొంతిల్లు కొనాలని చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారు మరింత విశాలమైన ఫ్లాట్‌ కావాలని.. బడ్జెట్‌ సహకరిస్తే విల్లాలకు మారిపోయే ప్రణాళికలో ఉన్నారు. ఒక్కో కుటుంబం అవసరం ఒక్కోలా ఉంది. కొందరు బడ్జెట్‌లో దొరికే ఆవాసాల కోసం చూస్తుంటే... మరికొందరు నగరంలోనే విలాసవంతమైన విల్లామెంట్స్‌, శివార్లలోని విల్లాల వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు, పెట్టుబడి దృష్ట్యా స్థలాల కోసం చూస్తున్న వారూ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఈ పండగల సమయంలోనే స్థిరాస్తి కొనుగోలు లావాదేవీలు పూర్తిచేయాలని భావిస్తున్నారు.

పాల్గొనే సంస్థలివే..

రెండు రోజులు జరిగే ప్రాపర్టీ షోలో 40 దాకా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. రాజపుష్ప ప్రాపర్టీస్‌, హానర్‌ హోమ్స్‌, సాయి సూర్య డెవలపర్స్‌, 360 లైఫ్‌-శ్రీముఖ్‌ నమిత హోమ్స్‌, ఎన్‌ స్క్వేర్‌ ప్రాజెక్ట్స్‌, వాసవి గ్రూప్‌, వర్టెక్స్‌ హోమ్స్‌, జనప్రియ ఇంజినీర్స్‌ సిండికేట్‌, అస్పైర్‌ స్పేసెస్‌, ఏపీఆర్‌ గ్రూప్‌, సాకేత్‌ గ్రూప్‌, జైన్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఏకేఎస్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌, ప్లానెట్‌ గ్రీన్‌, ప్రగతి గ్రీన్‌ మెడోస్‌ అండ్‌ రిసార్ట్స్‌, ముప్పు ప్రాజెక్ట్స్‌, ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌, సైబర్‌సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌, వర్చూసా లైఫ్‌ స్పేసెస్‌, కపిల్‌ ప్రాపర్టీస్‌,  పీవీఆర్‌ డెవలపర్స్‌,  ప్రణీత్‌ గ్రూప్‌, జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, ఎన్‌సీసీ ఆర్బన్‌, కేఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అలేఖ్య ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, గ్రీన్‌సిటీ ఎస్టేట్స్‌, శాంతాశ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌, సెంచూరీ హోమ్స్‌, అక్షిత ఇన్‌ఫ్రా, బీవీఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, జీకేఎస్‌ ఇన్‌ఫ్రా, ఫార్చూన్‌ 99 హోమ్స్‌, జాక్‌పాట్‌ సద్గురు హోమ్స్‌, గ్రీన్‌ హోమ్స్‌, దేవాన్స్‌ గ్రూప్‌, జస్విత కన్‌స్ట్రక్షన్స్‌, ఎస్‌ఎస్‌ డెవలపర్స్‌తో పాటూ ఈజీవే హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థలు పాల్గొంటున్నాయి.


అన్ని ప్రాంతాల్లోనూ..!

ప్రస్తుతం ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఐటీ రంగంలో ఉన్నాయి. దీంతో నిర్మాణ ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌ పశ్చిమం వైపే ఎక్కువగా వస్తున్నాయి. కొలువు దగ్గరే నివాసం ఉండాలనుకునే ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తున్నారు. మిగతా వారు ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు. నగరం చుట్టూ ఉన్న వేర్వేరు జాతీయ రహదారుల సమీపంలో ముఖ్య ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను చేపట్టాయి. పశ్చిమంతో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా తక్కువే. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు రవాణా అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాల్లోనూ నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.  ప్రభుత్వం సైతం నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ అభివృద్ధిపై దృష్టి పెట్టింది.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని