మొదట కొలువు.. తర్వాత ఇల్లే!

సామాన్య, మధ్యతరగతి వాసులు ఇల్లు కొనాలంటే గృహ రుణాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ప్రస్తుతం వడ్డీరేట్లు దశాబ్దం కనిష్టానికి 6.5 శాతానికి చేరడంతో ఇంటి అన్వేషణను మరింత ముమ్మరం చేశారు. అద్దె ఇల్లు వదిలి కలల స్వగృహం సొంతం చేసుకోవాలనే తపనతో ఎక్కువ మంది ఉన్నారని గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘పోస్టు జనరేషన్‌ రెంట్‌’ పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

Published : 01 Jan 2022 04:33 IST

ఈనాడు, హైదరాబాద్‌

సామాన్య, మధ్యతరగతి వాసులు ఇల్లు కొనాలంటే గృహ రుణాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ప్రస్తుతం వడ్డీరేట్లు దశాబ్దం కనిష్టానికి 6.5 శాతానికి చేరడంతో ఇంటి అన్వేషణను మరింత ముమ్మరం చేశారు. అద్దె ఇల్లు వదిలి కలల స్వగృహం సొంతం చేసుకోవాలనే తపనతో ఎక్కువ మంది ఉన్నారని గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘పోస్టు జనరేషన్‌ రెంట్‌’ పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

రెండో ప్రాధాన్యంగా..
సొంతిల్లుతో సమాజంలో హోదా మారడం, కుటుంబానికి భరోసా కావడంతో ఇల్లు కొనడం తమ జీవితంలో రెండో అత్యంత ప్రాధాన్యం అంటున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 25.5 శాతం మంది ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. 40.6 శాతంతో ఉద్యోగ భద్రత మొదటి ప్రాధాన్యంగా ఉంది.

ఇంటి నుంచి పనితో..
కొవిడ్‌తో ప్రాధాన్యాలు మారిపోయాయి. రెండేళ్లుగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. వీరిలో 16 శాతం మంది ఇల్లు కొనడం అత్యంత ముఖ్యం అంటున్నారు.

పెట్టుబడిగా..
ఇంటిని పెట్టుబడి కోణంలో చూస్తున్నవారి సంఖ్య 32.9 శాతం. ఎప్పటికప్పుడు వీటి ధరలు పెరుగుతుండటంతో అద్దెకు ఉండటం కంటే సొంతిల్లు కొనడం లాభసాటి అని వీరు భావిస్తున్నారు. గత ఏడాదిలో 49.12 శాతం మంది ఇంటి అన్వేషణలో ముందుకు సాగారు. గృహ రుణ సంస్థలను సంప్రదించి రుణ లభ్యతపై ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని