ఈ నెల 25, 26 తేదీల్లో ‘ఈనాడు’ ప్రాపర్టీ షో

బడ్జెట్‌ ధరల్లో లభించే సొంత ఇంటి కోసం మీ అన్వేషణా? ఫ్లాట్‌లు ఎక్కడ అందుబాటు ధరల్లో ఉన్నాయి? పెట్టుబడి దృష్ట్యా స్థలం ఎక్కడ కొంటే భవిష్యత్తులో కలిసి వస్తుంది?

Published : 18 Jun 2022 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌ ధరల్లో లభించే సొంత ఇంటి కోసం మీ అన్వేషణా? ఫ్లాట్‌లు ఎక్కడ అందుబాటు ధరల్లో ఉన్నాయి? పెట్టుబడి దృష్ట్యా స్థలం ఎక్కడ కొంటే భవిష్యత్తులో కలిసి వస్తుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టే రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లను సందర్శించాల్సిందే. అయితే, కొనుగోలుదారులు అన్నిచోట్ల తిరిగే శ్రమను తప్పించేలా, స్థిరాస్తి సంస్థలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది ‘ఈనాడు’ ప్రాపర్టీ షో. ఈ నెల 25, 26వ తేదీల్లో కేపీహెచ్‌బీలోని భ్రమరాంబిక మల్లికార్జున కల్యాణమండపంలో ప్రాపర్టీ షో-2022ను నిర్వహిస్తోంది. రెండు రోజులపాటు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రదర్శన ఉంటుంది. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ తమ స్టాళ్లను ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేస్తున్నాయి. మరిన్ని వివరాలకు 80085 52667, 97011 12439 నంబర్లలో సంప్రదించగలరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని