ఇల్లు.. క్రీడా హరివిల్లు

ఆహ్లాదకరమైన వాతావరణం.. పిల్లలు, పెద్దలు ఆటలాడేందుకు క్రీడా స్థలం, సేద తీరేందుకు చిన్న పార్కు, బహిరంగ జిమ్‌.. ఇదేదో గేటెడ్‌ కమ్యూనిటీ అనుకుంటున్నారా..? నగరంలో కొత్తగా నిర్మిస్తున్న చిన్న వెంచర్లలోనూ(తక్కువ స్థలంలో) అందుబాటులోకి వస్తున్న సదుపాయాలు. విశాల రహదారులు, చుట్టూ పచ్చని చెట్లు, 

Published : 30 Jul 2022 01:45 IST

చిన్న లేఅవుట్లలోనూ ఆట స్థలాలు, మినీ పార్కులు

నగరవాసుల ఆసక్తికి అనుగుణంగా నిర్మాణాలు

ఈనాడు, హైదరాబాద్‌

ఆహ్లాదకరమైన వాతావరణం.. పిల్లలు, పెద్దలు ఆటలాడేందుకు క్రీడా స్థలం, సేద తీరేందుకు చిన్న పార్కు, బహిరంగ జిమ్‌.. ఇదేదో గేటెడ్‌ కమ్యూనిటీ అనుకుంటున్నారా..? నగరంలో కొత్తగా నిర్మిస్తున్న చిన్న వెంచర్లలోనూ(తక్కువ స్థలంలో) అందుబాటులోకి వస్తున్న సదుపాయాలు. విశాల రహదారులు, చుట్టూ పచ్చని చెట్లు,   ప్రహరీ వంటివి ఒకప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీలకే పరిమితం. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే వెంచర్లలోనూ ఈ సదుపాయాలు ఉంటున్నాయి. నిర్మాణదారుడు వీటి ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండు, మూడు ఎకరాల విస్తీర్ణంలోని లేఅవుట్‌ అయినా నివాసితులు సరదాగా గడిపేందుకు.. చిన్నారులు ఆడుకునేందుకు కచ్చితంగా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నగర శివార్లలోని హయత్‌నగర్‌, శంకర్‌పల్లి, ఉప్పల్‌- భువనగిరి రహదారి తదితర ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గరం  కాంక్రీట్‌ జంగిల్‌లా మారిపోయింది. 200 నుంచి 300 గజాల స్థలం ఉంటే చాలు.. నాలుగంతస్తుల భవనం నిర్మించేస్తున్నారు. పార్కింగ్‌కు అవకాశం లేకుండా.. పిల్లలు ఆడుకొనేందుకు.. కనీసం ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే అవకాశం లేని పరిస్థితి. వాహనాల హారన్ల మోత, కాలుష్యం, వృత్తిపరమైన ఒత్తిడితో సతమతమయ్యేవారికి ఇలాంటి వాతావరణం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది. కాస్త సేద తీరేందుకు అవకాశం ఉండడం లేదు. నగరంలోని వేలాది పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేవు. చిన్నారులు ఆడుకునే పరిస్థితి లేదు. ఫలితం బాల్యంలోనే ఊబకాయాలు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు లేఅవుట్లలో ఇలాంటి సదుపాయాలు ఉన్నాయో లేదోనని ముందుగా ఆరా తీస్తున్నారు. కొంత ఖర్చు ఎక్కువైనా ఇవి ఉంటే చాలన్న భావనలో ఉంటున్నారు. చిన్నపాటి క్రీడా ప్రాంగణం, మైదానం ఉన్నవాటివైపు మొగ్గు చూపిస్తున్నారు.  

నిర్మాణానికి ముందే..  

శివార్లలోని మున్సిపాలిటీలు, వివిధ ప్రాంతాల్లో వేస్తున్న వెంచర్లలో మినీ క్రీడా ప్రాంగణం, అందులో వాలీబాల్‌, షటిల్‌ కోర్టులు, ఉల్లాసంగా గడిపేలా కొంత ఖాళీ ప్రదేశాన్ని సిద్ధం చేస్తున్నారు. భూమిని చదును చేసి రహదారుల నిర్మాణం పూర్తయ్యాక  క్రీడా స్థలం, ఓపెన్‌ జిమ్‌ వంటి వాటిని ముందుగా నిర్మిస్తున్నారు. ప్లాట్లు/ఇళ్లు కొనుగోలుకు వచ్చిన వారికి వీటినే చూపిస్తున్నారు. మరోవైపు కొనుగోలుదారులూ లేఅవుట్లలో అదనంగా ఇంకేం సదుపాయాలు కల్పిస్తున్నారని చూసుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని