ఇంటికి ఉన్న మార్గాలేంటి?

ప్రధాన నగరంలో పెరిగిన ఇళ్ల ధరలతో అన్ని వర్గాలవారు కొనలేని పరిస్థితి. ఇలాంటి వారు శివార్లవైపు మొగ్గు చూపడం మేలు. అనుకున్న ధరలో స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చు.

Published : 15 Oct 2022 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన నగరంలో పెరిగిన ఇళ్ల ధరలతో అన్ని వర్గాలవారు కొనలేని పరిస్థితి. ఇలాంటి వారు శివార్లవైపు మొగ్గు చూపడం మేలు. అనుకున్న ధరలో స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చు.

* ప్రభుత్వం శివార్లలోని పలు ప్రాంతాల్లో మూసీపై వంతెనలు, లింకురోడ్ల అనుసంధానం చేపట్టింది. ఫిర్జాదిగూడ నుంచి బండ్లగూడను కలిపేందుకు మూసీపై వంతెన నిర్మిస్తోంది. ఇది పూర్తైతే ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. నివాసాలకు కేంద్రంగా మారుతుంది. ధరలు ఒక్కసారిగా ఎగబాకుతాయి. ప్రస్తుతానికి ఇలాంటి ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నాయి. సిటీలో అన్నివైపులా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. దృష్టి పెడితే సొంతింటికి స్థలం తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

* కాస్త దూరం అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థలాలు తీసుకోవడం మేలు. ఆ ప్రాంతం కాస్త అభివృద్ధి కాగానే అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకోవచ్చు. విశాలమైన స్థలంలోనే కొంత విక్రయించి వచ్చిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవచ్చు. చేతిలో సొమ్ము ఉంటే స్థలం అమ్మాల్సిన పనేలేదు. భవిష్యత్తులో వాటికి మరింత డిమాండ్‌ వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని