ఇంటి ఆవరణే ఆరోగ్య ప్రదాయిని
గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంలో జాగ్రత్తలు
ఈనాడు, హైదరాబాద్: పచ్చని పరిసరాలు, ఔషధ మొక్కలు, పూల పరిమళం.. ఇలా గేటెడ్ కమ్యూనిటీలను నయన మనోహరంగా రూపొందిస్తున్నారు. ఆరోగ్యం కోసం జిమ్‌లకు, పార్కులకు పరుగులు పెట్టకుండా.. మీరుండే నివాసం చుట్టూ అలా ఒక రౌండ్ వేస్తే చాలు.. అర కిలోమీటరు లోపే అవన్నీ అందుబాటులో ఉండేలా నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వాకింగ్‌కు ఎలాంటి అవాంతరాలు కలగకుండా అందులోనే నడకదారులు నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం, యోగా సెంటర్, ప్రత్యేక జిమ్‌లు, ఈత కొలనులు సరేసరి.. ఇప్పుడు ప్రత్యేకంగా కమ్యూనిటీ వంటశాలలు సైతం ఉండేలా చూస్తున్నారు. నివాసితులు అక్కడే ఏదైనా వేడుక చేసుకోవాలనుకుంటే గేటు దాటి బయటకు వెళ్లాల్సిన పని లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పనివారిని సమకూర్చుకుంటున్నారు. ఇలా ఒక్కో గేటెడ్ కమ్యూనిటీ 25 మందికి తక్కువ లేకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
స్థాయి మారిన నివాసం..
ఒకప్పుడు ఇల్లంటే రెండు మూడు గదులుంటే సరిపోతుంది అనుకునేవారు.. ఇప్పుడు సువిశాలమైన నివాసాలను కోరుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్‌కే ఒక సొంత ఇల్లు సమకూరేంత ఖర్చు పెడుతున్నారు. ఇంటికి వెళ్లాక వేరే ప్రపంచం గుర్తురాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ స్థాయిలోని నివాసాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. నిత్యం అద్దంలా మెరిసేలా ఉంచేందుకు ప్రత్యేక పనివారిని సైతం ఇంటి యజమానులు నియమించుకుంటున్నారు. వంట చేసేవారు ఒకరైతే.. సామాన్లు శుభ్రం చేసేవారు మరొకరు.. కారు నడిపేవారు ఒకరైతే.. ఇంటి ఆవరణలో పచ్చదనం పెంచేందుకంటూ ఇంకొందరిని.. ఇలా ప్రత్యేక శిక్షణ పొందిన వారిని సమకూర్చుకుంటున్నారు. ఏదైనా రెస్టారెంట్లో తిన్న ఆహారం బాగుంటే.. తమ వంటవారిని అక్కడకు పంపి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆకట్టుకున్న ఉద్యానాలను తమ తోటమాలికి చూపించి తమ ప్రాంగణంలోని వాటి నిర్వహణ అలా ఉండేలా చూసుకుంటున్నారు.
కాలుష్యానికి కళ్లెం వేస్తున్నారు
పాలు కొనాలన్నా... టీ పొడి కావాలన్నా.. ఇలా నిత్యావసరాల కోసం ప్రతిసారి గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్తే కనీసం అర కి.మీ. ప్రయాణించాల్సి వస్తుంది. ఇలా ఇంధన వ్యయం, కాలుష్యం పెరగకుండా.. అన్నీ గేటెడ్ కమ్యూనిటీల్లోనే సమకూర్చుతున్నారు. ప్రత్యేక దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, కూరగాయలు నివాస ప్రాంతాలకు చేరేలా చూస్తున్నారు. ఇక్కడే ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించడానికి సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక భవనాన్ని నిర్మించి వాటి వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగాలు చేసుకునే విధంగా కో-వర్కింగ్ ప్లేస్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా గేటు దాటకుండా అన్ని సౌకర్యాలు కల్పించి వాహనాలను బయటకు తీసే పని లేకుండా చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే
-
General News
Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
-
India News
Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!
-
Movies News
Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
-
World News
Earthquake: భూకంప విలయం.. మరుభూమిని తలపిస్తున్న తుర్కియే, సిరియా నగరాలు