Updated : 05 Nov 2022 06:36 IST

కొంపల్లిలో నేటి నుంచి క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

ఈనాడు, హైదరాబాద్‌: క్రెడాయ్‌ హైదరాబాద్‌ తొలిసారి హైదరాబాద్‌ ఉత్తరం వైపు ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. నేడు, రేపు కొంపల్లిలోని ఆస్పిసియస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇది జరగనుంది. హైదరాబాద్‌ నార్త్‌లో ప్రముఖ బిల్డర్లు చేపట్టిన పలు గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించనున్నారు. మొత్తం 44 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 10.30కు మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాపర్టీ షోని ప్రారంభించనున్నారు. ఉత్తరం వైపు మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని.. బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని.. ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని