Published : 19 Nov 2022 01:24 IST

సిద్ధంగా ఉన్న ఇళ్లు చాలా ఖరీదు గురూ!

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఇళ్లు.. నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పోలిస్తే చాలా ఖరీదుగా మారాయి. వీటి నిర్మాణాలు సైతం ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌లో పూర్తైన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నార్త్‌వెస్ట్‌లో,  సౌత్‌వెస్ట్‌లోనూ లభ్యత ఎక్కువగా ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేమో నార్త్‌ఈస్ట్‌లో, సౌత్‌వెస్ట్‌లో అధికంగా ఉన్నాయి. క్రెడాయ్‌, కొలియర్స్‌ సంయుక్తంగా విడుదల చేసిన హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ నివేదికలో ఈ విషయాలు పొందుపర్చారు.  ఏడాది కాలంలోనే ఇళ్ల ధరలు 8 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో అయితే వార్షిక పెరుగుదల ఏకంగా 26 శాతంగా ఉంది. వీటి లభ్యత తక్కువగా ఉండటమే ధరల పెరుగుదలకు కారణమని నివేదికలో స్పష్టం చేశారు. * నగరంలో రెండు, మూడు పడక గదులకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. వీటిలో వార్షిక ధరల పెరుగుదల 9 శాతంగా ఉంది. * ఒక పడక గది, 4 నాలుగు పడక గదుల ఇళ్లకు డిమాండ్‌ పరిమితంగా ఉంది. వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. * నగరంలో విక్రయించని ఇళ్లవాటా 8 శాతంగా ఉంది.

ప్రాంతాల వారీగా.. : సెంట్రల్‌: హిమాయత్‌నగర్‌, సోమాజిగూడ, బేగంపేట, అమీర్‌పేట సెంట్రల్‌ పరిధిలోకి వస్తాయి. మూడో త్రైమాసికంలో ఇక్కడ ధరలు తగ్గాయి.
నార్త్‌ఈస్ట్‌: ఈసీఐఎల్‌, ఘట్‌కేసర్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌, పోచారం దీని పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మూడో త్రైమాసికంలో ధరలు పెరిగాయి.
నార్త్‌వెస్ట్‌: బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, నానక్‌రాంగూడ ప్రాంతాలను నార్త్‌వెస్ట్‌గా పరిగణిస్తున్నారు. ఇక్కడ స్వల్పంగా ధరలు తగ్గాయి.
సౌత్‌ఈస్ట్‌: బోడుప్పల్‌, కర్మాన్‌ఘాట్‌, కొత్తపేట, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇక్కడ కూడా మూడో త్రైమాసికంలో ధరలు తగ్గాయి. సౌత్‌వెస్ట్‌: కోకాపేట, మణికొండ, పుప్పులగూడ, షేక్‌పేట, శంషాబాద్‌ ప్రాంతాల్లో స్వల్పంగా ధరలు పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts