Published : 24 Dec 2022 00:56 IST

బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈడెన్‌ గార్డెన్‌

65 ఎకరాల్లో విలాసవంతమైన ప్లాటెడ్‌ కమ్యూనిటీని ప్రారంభించిన జీస్క్వేర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాదిలో అతిపెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌ జీస్క్వేర్‌ హౌసింగ్‌ సంస్థ హైదరాబాద్‌లో తమ మొదటి ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రారంభించింది. క్రీడా నేపథ్యపు విలాసవంతమైన ప్లాటెడ్‌ కమ్యూనిటీని బీఎన్‌రెడ్డినగర్‌ వద్ద ఈడెన్‌ గార్డెన్‌ పేరుతో అభివృద్ధి చేసింది. విల్లాలు కట్టుకునేందుకు అనువుగా ఉండేలా అన్నిరకాల సౌకర్యాలతో ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దింది. 65 ఎకరాల విస్తీర్ణంలో 484 ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్లాట్లు ఈ కమ్యూనిటీలో ఉన్నాయని... జీహెచ్‌ఎంసీ, రెరా అనుమతులు వచ్చాయని జీస్క్వేర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రాజెక్ట్‌లో వందకు పైగా ప్రపంచ శ్రేణి వసతులు, 40కిపైగా ప్రత్యేక క్రీడా వసతులను కల్పిస్తున్నట్లు తెలిపింది. బ్లాక్‌టాప్‌ రోడ్లు,  ప్రీమియం వీధి దీపాలు, చక్కగా నిర్మించిన భూగర్భ విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన కమ్యూనిటీగా తీర్చిదిద్దినట్లు వెల్లడించింది. ఐదేళ్ల పాటు తామే ఉచితంగా నిర్వహణ సైతం అందిస్తున్నట్లు తెలిపింది. ప్రాజెక్ట్‌కు సమీపంలోనే పేరున్న పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, మాల్స్‌, ఇతర సామాజిక సదుపాయాలు ఉన్నాయని తెలిపింది. ఈడెన్‌ గార్డెన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా జీస్క్వేర్‌ సంస్థ సీఈవో ఎన్‌. ఈశ్వర్‌ మాట్లాడుతూ... ‘బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈడెన్‌ గార్డెన్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నగరం లోపల తమ సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలని కలలు గనే వారికి ఇది అత్యుత్తమ అవకాశం. విభిన్నమైన విలాసవంతమైన సదుపాయాలతో పాటు క్రీడా సదుపాయాలను సైతం కొనుగోలుదారులకు అందిస్తున్నాం. హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యుత్తుమ కనెక్టివిటీ కలిగిన ప్రాంతమిది. తెలంగాణ  ప్రభుత్వ నిర్ణయాలతో కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతర కాలంలో అసాధారణ వృద్ధిని హైదరాబాద్‌ చూసింది. మా కొత్త ప్రాజెక్ట్‌ నగరంలోని గృహ కొనుగోలుదారులకు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారులకు కొత్త అవకాశాన్ని అందించనుంది’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని