Housing Market Predictions: ఇళ్ల క్రయవిక్రయాలు.. 2023 ఎలా ఉండొచ్చు?
ఈనాడు, హైదరాబాద్: ఇళ్ల క్రయవిక్రయాల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక ఏడాది భారీ పెరుగుదల ఉంటే. మరో సంవత్సరం అంతే స్థాయిలో తగ్గుదల కనిపిస్తోంది. కొవిడ్ అనంతర ఏడాదిలో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు పెరగగా.. ఆ తర్వాత సంవత్సరంలో సాధారణ స్థాయికి వచ్చాయి. ఇటీవల నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే.. ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2021తో పోలిస్తే 2022లో తగ్గినట్లు కనబడింది. అంతమాత్రాన మార్కెట్ తగ్గినట్లు కాదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020లో కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఇళ్ల కొనుగోలు.. 2021లో వాస్తవ రూపం దాల్చడంతో భారీ ఎత్తున పెరుగుదల నమోదైందని చెబుతున్నాయి. దీంతో 83 వేలకు రిజిస్ట్రేషన్లు పెరిగాయని అంటున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వార్షికంగా 50 వేల నుంచి 60 వేల మధ్యన రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయని.. ఆ రకంగా చూస్తే 2022లో 68 వేల రిజిస్ట్రేషన్లు జరగడం సానుకూలమని రియల్ ఎస్టేట్ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఇది ఏటేటా పెరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మందగమనం, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కారణంగా మార్కెట్ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నెమ్మదిగా ఉంటుందనే అంచనాలను మరో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ వెల్లడించింది.
ఈ ఏడాది అంచనాలు
* వడ్డీరేట్లు గత కొన్ని త్రైమాసికాల్లో దాదాపు 2 శాతం పెరిగిన తరుణంలో ప్రధానంగా బడ్జెట్, మిడ్ ఎండ్ విభాగాల గృహ కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని సీబీఆర్ఈ అంటోంది.
* పోటీ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యత దృష్టా మెరుగైన సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య ప్రమాణాలు పెంచే హరిత ప్రాజెక్టులు, భద్రతపై దృష్టి కేంద్రీకరించేలా ప్రాజెక్ట్‌ల స్థాయిని ఉన్నతీకరించే దిశగా అడుగులు పడనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సత్కారం
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ