అద్దెల కోసం వేటిలో కొనొచ్చు?
హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్‌లో స్వీయ అవసరాల కోసమే ఎక్కువగా ఇళ్లు కొనుగోలు చేస్తుంటారు. ధర పెరగ్గానే స్వల్పకాలంలో అమ్మడం కోసం కొనే ఇన్వెస్టర్లు ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ.
హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్‌లో స్వీయ అవసరాల కోసమే ఎక్కువగా ఇళ్లు కొనుగోలు చేస్తుంటారు. ధర పెరగ్గానే స్వల్పకాలంలో అమ్మడం కోసం కొనే ఇన్వెస్టర్లు ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ. ఇప్పుడిప్పుడే గృహాలపై పెట్టుబడి పెట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు. వీటితో పాటు వాణిజ్య నిర్మాణాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వీటిలో రాబడి పరంగా ఏది ఆకర్షణీయం?
హైదరాబాద్‌లో ఇటు గృహ, అటు వాణిజ్య నిర్మాణాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు దేశంలోనే మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరం అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందడంతో కార్యాలయాల స్థలాలకు డిమాండ్ పెరిగింది. సిటీ చుట్టూ కొత్త టౌన్‌షిప్‌లు ఏర్పాటవుతున్నాయి. పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ ఏర్పడింది.
వాణిజ్య ఆస్తుల్లో..
* పెట్టుబడి పరంగా చూస్తే రాబడి అద్దె రూపంలో 6 నుంచి 10 శాతం వరకు వాణిజ్య ఆస్తులపై పొందవచ్చు. మీ భవనం ఉన్న స్థలం, అక్కడి డిమాండ్‌ను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మూలధన విలువ పెరగడం మాత్రం ఇందులో పరిమితంగా ఉంటుంది. ఎక్కువగా వ్యవస్థాగత మదుపర్లు ఈ తరహా వాణిజ్య ఆస్తులపై దీర్ఘకాలానికి పెట్టుబడి పెడుతుంటారు. అద్దెల నిర్వహణకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. అవే వీటిని నిర్వహిస్తుంటాయి.
* ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కొంత అధ్యయనం, తెలిసిన వారి తోడ్పాటు అవసరం. ధైర్యంగా ముందడుగు వేస్తే పెట్టుబడికి తగ్గ రాబడి మాత్రం ఉంటుంది.
* వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో సొమ్ము కావాల్సి ఉంటుంది. వీటిలో మాల్స్, కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంటారు. దీర్ఘకాలానికి లీజు ఒప్పందాలు ఉంటాయి. అద్దెలు ఎక్కువే వస్తాయి.
* వాణిజ్య ఆస్తుల్లో మరమ్మతులు, కొత్తగా ఎవరైనా వస్తే వారికి కావాల్సినట్లుగా కట్టించుకోవడం అద్దెకు దిగేవారే చూసుకుంటారు. యజమానికి పెద్ద ఖర్చు ఉండదు.
* వీటిలో కొన్నిసార్లు వివాదాలు ఏర్పడుతుంటాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుంటాయి. ఎదుర్కొనే సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి.
* దేశ, స్థానిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులను బట్టి వాణిజ్య స్థలాలకు డిమాండ్ ఆధారపడి ఉంటుంది. హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు ఖాళీగా ఉంచాల్సి రావొచ్చు.
గృహల్లో...
* గృహ అద్దెలు ఎక్కువగా వ్యక్తిగతంగానే ఇస్తుంటారు. కాబట్టి పెట్టుబడితో పోలిస్తే రాబడి తక్కువే. ఇప్పుడిప్పుడే ఇందులోకి వ్యవస్థీకృత మదుపర్లు వస్తున్నారు. వీరితో ఒప్పందాలు చేసుకుంటే వాణిజ్య ఆస్తుల రాబడితో పోటీపడవచ్చు. స్థిరాస్తుల విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఇది చుట్టూ వచ్చే అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల రాకను బట్టి ఆధారపడి ఉంటుంది.
* ఇళ్లు కొనడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. నిబంధనల మేరకు ఉన్నవాటినే కొనుగోలు చేస్తే చాలు. నిలకడ మీద అద్దెలు వస్తాయి.
* నగరంలో సొంతిల్లు లేనివారే అధికం కాబట్టి ఇంటి అద్దెలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అద్దె కూడా పెరగడమే తప్ప తగ్గడం అరుదు.
* లభ్యత ఎక్కువగా ఉంటుంది. వృద్ధి చెందే ప్రదేశాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తే మంచి అద్దెలు పొందవచ్చు.
* ఆదాయపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Crime News
Nizamabad: ఇందల్వాయి టోల్ గేట్ వద్ద కాల్పుల కలకలం