హైదరాబాద్‌ రియల్‌ మార్కెట్‌లోకి ‘కాసాగ్రాండ్‌’

చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టిన కాసాగ్రాండ్‌ సంస్థ హైదరాబాద్‌ మార్కెట్లోకి సైతం ప్రవేశించింది.

Published : 13 May 2023 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టిన కాసాగ్రాండ్‌ సంస్థ హైదరాబాద్‌ మార్కెట్లోకి సైతం ప్రవేశించింది. మామిడిపల్లిలో సుమారు 10.1 ఎకరాల విస్తీర్ణంలో బ్రిటిష్‌ నిర్మాణశైలిలో విలాసవంతమైన 140 విల్లాల ప్రాజెక్ట్‌ ‘హాన్‌ఫోర్డ్‌’ను ప్రారంభించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024 నాటికి 3 వేల కోట్ల టర్నోవర్‌తో హైదరాబాద్‌లో 50 లక్షల చదరపు అడుగుల ప్రైమ్‌ రియల్‌ ఎస్టేట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించబోతున్నట్లు ఆ సంస్థ ఎండీ అరుణ్‌ ఎంఎన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని