నిర్మాణంలో ఉన్న ఇళ్ల ధరల్లో పెరుగుదల

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) 2023 మార్చితో ముగిసిన త్రైమాసికానికి రెసిడెక్స్‌ను విడుదల చేసింది.

Published : 10 Jun 2023 00:14 IST

మూడు నెలల్లోనే మారిపోతున్న స్థిరాస్తుల రేట్లు
హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడ, విశాఖలో ఎక్కువ
50 నగరాల్లో ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) 2023 మార్చితో ముగిసిన త్రైమాసికానికి రెసిడెక్స్‌ను విడుదల చేసింది. హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(హెచ్‌పీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరం ఆధారంగా త్రైమాసిక ప్రాతిపదికన దేశంలోని ఎంపిక చేసిన 50 నగరాల్లో నివాస స్థిరాస్తుల ధరల కదిలికను ట్రాక్‌ చేసింది. పెరుగుతున్న నిర్మాణ వ్యయం స్థిరాస్తుల ధరలపై ప్రభావం చూపుతోందని తెలిపింది. నివేదికలో ముఖ్యంశాలను పరిశీలిస్తే..
* ప్రైమరీ లెండింగ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి  సేకరించిన అసెస్‌మెంట్‌ ధరల ఆధారంగా 50 నగరాల్లో  స్థిరాస్తుల ధరలు గత ఏడాదితో పోలిస్తే 5.8 శాతం పెరిగాయి. అంతక్రితం ఏడాది పెరుగుదల 5.30 శాతంగా ఉంది.
* ఇళ్ల ధరల్లో వార్షిక పెరుగుదల నగరాలను బట్టి వేర్వేరుగా మారుతూ ఉంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అత్యధికంగా 19.6 శాతం పెరుగుదల నమోదైంది. లూధియానాలో 12.9 శాతంగా ఉంది.
* హైదరాబాద్‌లో 9.4 శాతం వార్షిక పెరుగుదల ఉంటే... ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరింత ఎక్కువగా 9.4% ధరల పెరుగుదల ఏడాదికాలంలో  నమోదైంది. విజయవాడలో 5 శాతంగా ఉంది.

క్రితం త్రైమాసికంతో పోలిస్తే..

అక్టోబరు-డిసెంబరు 2022 త్రైమాసికంతో పోలిస్తే జనవరి-మార్చి 2023 త్రైమాసికం ముగింపు నాటికే ధరలు పెరిగాయి. * హైదరాబాద్‌ (1.6%), విజయవాడ(0.2%), విశాఖపట్నం(3.6%)లో ఇళ్ల ధరల పెరుగుదల కనిపించింది.

మార్కెట్‌ ప్రకారం.. : విక్రయించని.. నిర్మాణంలో ఉన్న  ఇళ్ల ధరల ఆధారంగా 50 నగరాల్లో సిరాస్తుల మార్కెట్‌ ధరను లెక్కించారు.
* వీటి ధరలు ఏడాదిలోనే 11.7 శాతం పెరిగాయి. అంతక్రితం ఇది 4.8 శాతంగా ఉంది. * హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల ధరలు 5.2% పెరిగితే... విజయవాడలో 16.9%, విశాఖపట్నం 26.2 శాతంతో భారీగా పెరిగాయి.  లక్నోలో అత్యధికంగా 47.6 శాతం పెరుగుదల నమోదైంది.
* డిసెంబరు 22 నాటితో మార్చి 23తో ముగిసిన త్రైమాసికంతో పోల్చగా  50 నగరాల్లో సగటున 2.6 శాతం నిర్మాణంలో ఉన్న ఇళ్ల ధరలు పెరిగాయి.* హైదరాబాద్‌లో 1.4 శాతంతో స్వల్పంగా పెరగ్గా.. విశాఖపట్నం 3.6, విజయవాడ 3.2 శాతంతో త్రైమాసిక పెరుగుదల ఎక్కువే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని