బాల్కనీల్లోనే పెంచుకోవచ్చు
పచ్చదనం.. పర్యావరణం.. ఆహ్లాదకర వాతావరణంపై మనసుంటే.. సొంతిల్లు అయినా.. విల్లా అయినా.. అపార్టుమెంట్‌లో అయినా మొక్కలు పెంచేయవచ్చు. అపార్టుమెంట్లలో బాల్కనీలే పచ్చందాలకు చిరునామాగా మలిచేయవచ్చు.
ఈనాడు, హైదరాబాద్: పచ్చదనం.. పర్యావరణం.. ఆహ్లాదకర వాతావరణంపై మనసుంటే.. సొంతిల్లు అయినా.. విల్లా అయినా.. అపార్టుమెంట్‌లో అయినా మొక్కలు పెంచేయవచ్చు. అపార్టుమెంట్లలో బాల్కనీలే పచ్చందాలకు చిరునామాగా మలిచేయవచ్చు. ఎక్కడ ఎలాంటి మొక్కలు అవసరమనేది గుర్తెరగాలి. ఒకప్పుడు దుస్తులు ఆరపెట్టుకోడానికే అనేట్టుండే బాల్కనీలు.. ఇప్పుడు అక్కడ ఇంటిల్లపాదీ కూర్చొని మాట్లాడుకునేంత స్థలం ఉంటోంది. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా సువాసనలు వెదజల్లే రకాల నుంచి ఔషధ మొక్కల వరకు పెంచుతున్నారు. కొన్ని చోట్ల అయితే కుండీలు పెట్టుకుని పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంటే.. మరికొన్ని చోట్ల ఏకంగా మట్టిని నింపి ల్యాండ్‌స్కేపింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు.
సాగు చేసేస్తున్నారు..
ఇంటి ఆవరణ, బాల్కనీల్లో వాము ఆకులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వంటివి పండిస్తున్నారు. రసాయనాలు లేని పంటలు కూడా పండించేస్తున్నారు. కాస్త స్థలముంటే.. సొంతింటిలో కూరగాయల సాగు చేసేందుకు కూడా వీలుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంటికి కావాల్సిన టమాటాలు, వంకాయలు పండించవచ్చని ఉద్యానశాఖ చెబుతోంది. మీకు కాస్త ఉత్సాహం ఉంటే.. మేము ఊతమిస్తామంటూ ఉద్యానశాఖ అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు కరపత్రాలు ప్రచురించి.. ఎరువు, విత్తనాలు, మొక్కలు ఇలా ఎక్కడ ఏమి దొరుకుతాయో చిరునామాతో పాటు.. సంబంధిత ఫోను నంబర్లు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.
మన ఇల్లు.. మన కూరగాయలు, ఔషధ మొక్కలు..
మనం నిత్యం వాడే కూరగాయలు, పండ్లలో కిలో దగ్గర 0.2 శాతం రసాయన అవశేషాలు (విషం రూపంలో) ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. వాటిని తప్పక తినాల్సిన దుస్థితి నగరవాసులది. దీంతో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అలా అని సర్దుకుపోకండని.. ఉద్యానశాఖ చెబుతోంది. మిద్దె మీద కూరగాయల సాగుతోపాటు.. ఇంటి ఆవరణలో.. కిటికీలకు వేలాడదీసిన కుండీల్లో పంట పండించేద్దాం.. రండి అంటూ పిలుపునిస్తోంది. ప్రతి నెలా రెండో శనివారం, నాలుగో ఆదివారం ఇంటి ఆవరణలో సాగుకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నామని చెబుతోంది. ఇందుకు మీరు చేయాల్సిందంతా.. నాంపల్లి రైల్వేస్టేషన్ వెనక వైపు ఉన్న అర్బన్ ఫార్మింగ్ విభాగాన్ని సందర్శిస్తే సరిపోతుందని పేర్కొంది. లేదంటే ఉద్యానశాఖ ఉప సంచాలకులు పి. యాదగిరి 9705384384 నంబరును సంప్రదించాలని తెలిపింది. ఉద్యాన శాఖ అధికారులు 7997725411, 8919443178, 9666855866, 9398139392 నంబర్లకు ఫోను చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cricketers AI Look: కోహ్లీ టు ధోనీ.. రెట్రో లుక్స్: ఏఐ మాయ అదుర్స్
-
Nara Lokesh: వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులు: నారా లోకేశ్
-
Janasena: తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ.. జాబితా ఇదే
-
Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్!
-
Hyderabad: హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు