నలువైపులా భద్రం.. అదే వాస్తు సూత్రం

ఇల్లు కట్టుకునేవారు కేవలం తమ సౌకర్యం మాత్రమే చూస్తున్నారు. వాస్తు శాస్త్రం నియమాల ప్రకారం మన ఇంటి వాస్తు పాటించడంలో పక్క ఇళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు పి.కృష్ణాదిశేషు. 

Published : 22 Jun 2024 01:23 IST

ఈనాడు, హైదరాబాద్‌ 

ఇల్లు కట్టుకునేవారు కేవలం తమ సౌకర్యం మాత్రమే చూస్తున్నారు. వాస్తు శాస్త్రం నియమాల ప్రకారం మన ఇంటి వాస్తు పాటించడంలో పక్క ఇళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు పి.కృష్ణాదిశేషు. 

ఇంటి నిర్మాణ సమయంలో ఇబ్బందైనా కొద్దిరోజులే కదా అని చాలామంది పక్కవారు పెద్దగా అభ్యంతరం పెట్టరు. ఇరుగుపొరుగు అన్నాక ఆ మాత్రం సహకరించుకోకపోతే ఎలా అనే సర్దుబాటు ధోరణే ఎక్కువ మందిది. కట్టుకునేవారు కూడా పొరుగువారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మసులుకుంటే ఏ సమస్యలు ఉండవు. కానీ తెలిసో, తెలియక కొందరు కాస్తంత స్వార్థం, మరి కాస్తంత వాస్తును నిర్లక్ష్యం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. 

  • కొందరు తమ ఇంటి ప్రహరీని తూర్పు ఉత్తరం దిశల్లో ఎత్తు తక్కువగా.. పడమర దక్షిణం దిశల్లో  ఎక్కువ ఎత్తులో కట్టుకుంటుంటారు. మన దక్షిణం పడమర దిశలోని గోడలు పక్కవారికి తూర్పు పడమర అవుతాయి. తద్వారా ఎత్తైన గోడలతో గాలి వెలుతురు రాకపోకలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. 
  • ఇంటిని, ర్యాంపులను ప్రహరీ దాటి  కొందరు బయటికి నిర్మిస్తున్నారు. రహదారిపైకి మూడు నాలుగు అడుగుల దూరం ర్యాంపులు కడుతున్నారు. ఆయా వీధుల్లో తిరిగే వారికి ఇది అసౌకర్యం. గేటు లోపే ర్యాంపు ఉండేలా చూసుకోవాలి. 
  • ఇంటి బయట వాహనం నిలపడమే దారికి ఆటంకం అంటే ఈ మధ్యకాలంలో కారు నిలిపేందుకు ఏకంగా షెడ్డునే వేస్తున్నారు. తమకు చెందిన స్థలంలో ఏదైనా నిర్మించుకోవచ్చు. కానీ ప్రజలందరికీ చెందాల్సిన రహదారిలో ఆటంకం కలిగేలా వాహనాల కోసం నిర్మాణాలు చేపట్టరాదు. ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇరుగుపొరుగు వారితో గొడవలకు దారితీస్తుంది.
  • మొక్కల కోసం ప్రహరీ బయట ఇదివరకు అడుగు మేర స్థలంలో పెంచేవాళ్లు. ఇప్పుడు రెండు అడుగులు దాటి మూడు అడుగులలో రెండు వరసల్లో పెంచుతున్నారు. పచ్చదనం పెంచడం మంచిదే. కానీ పాదచారుల కోసం వదలాల్సిన బాటను పూర్తిగా ఆక్రమించి మొక్కలు పెంచితే.. ఆ తర్వాత వాహనాలు నిలిపితే సగం దారి మూసుకుపోతుంది. ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచి.. బయట పాదబాటలను నిర్మిస్తే మంచిది.  ః కొత్తగా ఈ మధ్యకాలంలో జనరేటర్లను పాదబాటలపై ఏర్పాటు చేస్తున్నారు. వాన, ఎండ నుంచి రక్షణ కోసం వాటికి షెడ్‌ వేస్తున్నారు. నడకకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇంటికి సంబంధించిన ప్రతిదీ వారి ప్రాంగణంలోనే ఉండాలి.
  • మన పరిధిలో ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయడం వల్ల అందరికీ శాస్త్రరీత్యా శుభం కలుగుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని