ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు...

* ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకుందామనుకుంటాం. మున్సిపల్‌ కార్పొరేషన్‌, గ్రామ పంచాయతీకి వెళ్లి అనుమతి తీసుకుని పునాదులు తవ్వుదాం అనుకునే సమయానికి... ప్రభుత్వాధికారులు వచ్చి ఔటర్‌రింగ్‌ రో

Updated : 14 Nov 2022 14:28 IST

ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు....

ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎలాంటి అంశాలు పరిశీలించాలి?

* ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకుందామనుకుంటాం. మున్సిపల్‌ కార్పొరేషన్‌, గ్రామ పంచాయతీకి వెళ్లి అనుమతి తీసుకుని పునాదులు తవ్వుదాం అనుకునే సమయానికి... ప్రభుత్వాధికారులు వచ్చి ఔటర్‌రింగ్‌ రోడ్డు కోసం మార్కింగ్‌ చేసుకున్న స్థలమిది, మీరెలా కొనుగోలు చేశారని ప్రశ్నించినప్పుడు మోసపోయామన్న కలుగుతుంది.

ఇదొక్క సందర్భమే కాదు... అభివృద్ధి చెందుతున్న నగరాలు/ పట్టణాల్లో మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం మార్కింగ్‌ చేసిన లేదా సేకరించిన భూములు కొన్ని ఉంటాయి. అందుకే ఇలాంటివి ముందే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొనుగోలు చేయబోయే ఇంటి స్థలం లేదా లేఅవుట్‌ ఏ ప్రాజెక్టు కోసమైనా ప్రభుత్వం గుర్తించిందా అని నిర్థరించుకోవాలి. ఆ భూమి ఏ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయం పరిధిలో ఉందో తెలుసుకుని అక్కడ సంప్రదించాలి. సంబంధిత వివరాలు తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని